తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చెల్లి కవితే ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వడం లేదని అన్నారు.
ఇవాళ హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. “ముందు ఆయన కుటుంబం ఒక తాటి మీదకు రావాలి. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో స్లీపింగ్ ప్రెసిడెంటో నాకేం తెలుసు. సూసైడల్ టెండెన్స్ తో కొంతమంది బాధపడుతున్నారు. కవితకు ఆమె ఇంట్లోనే విలువలేదు. నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు.. వైరుధ్యం లేదు..
Also Read: ఈ 2 స్మార్ట్‌ఫోన్లు ఖతర్నాక్ ఉన్నాయ్ బాస్.. రెండింట్లో ఏది బెస్ట్? తెలుసుకోండిలా..
కేసీఆర్ నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. తెలంగాణకు చేయాల్సిన నష్టమంతా కేసీఆర్ చేశారు. 2004 నుంచి 2014 వరకు 700 టీఎంసీలు రాయలసీమకు పోతే… 12 టీఎంసీలు కేసీఆర్ హయాంలో రాయలసీమకు తరలించారు.
అధికారం, డబ్బు వైరుధ్యాన్ని తెచ్చిపెడుతుంది. కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగానీ, బాత్రూంలు కడిగే వాళ్లతో చర్చకు నేను పోను” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.