తెలంగాణ వరద బాధితుల సహాయార్థం లలితా జ్యువెలర్స్ అధినేత విరాళం

తెలంగాణ వరద బాధితులను ఆదుకోవడానికి లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ తన వంతు సాయం అందించారు.

lalithaa jewellery kiran kumar: తెలంగాణ వరద బాధితులను ఆదుకోవడానికి లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ తన వంతు సాయం అందించారు. మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా లలిత జ్యువెలర్స్ అధినేతను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ”నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం రేలిఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు ఇచ్చాను. ఈరోజు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు ఇచ్చాను. రెండు తెలుగు రాష్ట్రాలో వరదల వల్ల పెద్ద నష్టం జరిగింది. నేను ఇచ్చింది పెద్ద అమౌంట్ కాదు. వరదల వల్ల నష్టపోయిన వారికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. అందుకే నా వంతు సాయం చేశాను. ప్రతి ఒక్కరు సాయం చేసేందుకు ముందుకు రావాలి. వ్యాపారులు సైతం ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాన”ని చెప్పారు.

వరద బాధితులకు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు అందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు. మైత్రా ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రం కైలాస్, అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవి కైలాస్‌లు కోటి రూపాయల విరాళం అందించారు.

ప్రముఖ నిర్మాత, నటి యార్లగడ్డ సుప్రియ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఆ మేరకు విరాళం చెక్కును అందజేశారు.

Also Read : విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచిన లలితా జ్యువెలర్స్ అధినేత

హైదరాబాద్ రేస్ క్లబ్, ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్లను విరాళంగా అందజేసింది. రేస్ క్లబ్ డైరెక్టర్, లోక్‌సభ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, మరో డైరెక్టర్ నర్సింహారెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు.

 

ట్రెండింగ్ వార్తలు