Small Majority : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన నేతలు వీరే

చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. యాకుత్ పురాలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 878 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Small Majority

Leaders Won Small Majority : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు భారీ మెజారిటీ సాధించగా మరికొంతమంది బొటాబొటీ ఓట్లతో గట్టెక్కారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఆదివారం విడుదలైన విషయం తెలిసిందే. కాలే యాదయ్య, జాఫర్ హుస్సేన్, లక్ష్మీకాంతరావు, గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, మాజిద్ హుస్సేన్, పి.సుదర్శన్ రెడ్డి, హరీష్ బాబు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎడ్మ బొజ్జు తక్కువ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. యాకుత్ పురాలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 878 ఓట్లు, జుక్కల్ లో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు 1,152 ఓట్లు, దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థి గవినోళ్ల మధుసూదన్ రెడ్డి 1392 ఓట్లు, నాంపల్లిలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ 2037 ఓట్లు, బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థి పి.సుదర్శన్ రెడ్డి 3062 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Telangana Election Results : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10మంది మహిళలు.. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు

సిర్పూర్ లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీషశ్ బాబు 3088 ఓట్లు, కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 3163 ఓట్లు, బాల్కొండలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి 4533 ఓట్లు, సూర్యపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి 4,606 ఓట్లు, ఖానాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్మ బొజ్జు 4702 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ట్రెండింగ్ వార్తలు