Ambulances Allowed : ఏపీ-తెలంగాణ సరిహద్దులో అంబులెన్స్ లకు లైన్ క్లియర్.. బెడ్‌ కన్‌ఫర్మేషన్ ఉన్న వాటికే అనుమతి

కరోనా కేసులు తగ్గుతున్నా తెలంగాణలో వైద్య సేవలపై ఒత్తిడి మాత్రం పెరుగుతూనే ఉంది. హైదరాబాద్‌ హెల్త్‌ హబ్‌గా మారడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు.

Line cleared for ambulances : కరోనా కేసులు తగ్గుతున్నా తెలంగాణలో వైద్య సేవలపై ఒత్తిడి మాత్రం పెరుగుతూనే ఉంది. హైదరాబాద్‌ హెల్త్‌ హబ్‌గా మారడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని 45శాతం కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవే.

దీంతో నిన్నటి నుంచి ఆస్పత్రుల్లో అడ్మిషన్ హామీలేని ఇతర రాష్ట్రాల కరోనా బాధితులను తెలంగాణ పోలీసులు బోర్డర్‌లోనే ఆపేశారు. అయితే వెంటనే కరోనా బాధితులు ఇబ్బంది పడకుండా తెలంగాణ సర్కార్‌ అంబులెన్స్‌లకు లైన్‌ క్లియర్ చేసింది. హైదరాబాద్‌లో బెడ్‌ కన్‌ఫర్మేషన్ ఉన్న అంబులెన్స్‌లను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.

ఏపీ, కర్ణాటక, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎక్కువగా కరోనా బాధితులు వస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ముప్పు ఏర్పడకుండా కొన్ని ఆంక్షలను పెట్టింది.

వైద్యం కోసం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు కోవిడ్ పేషెంట్లు క్యూ కడుతున్నారు. మెరుగైన వైద్య సౌకర్యారులు ఉండటంతో.. రోడ్డు మార్గంలోనే కాకుండా.. ఎయిర్ అంబులెన్సుల్లో కూడా బాధితులు హైదరాబాద్‌కు వస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు