పిల్లలను బెంగ పెట్టుకోవద్దని చెప్పండి.. ములాకత్‌లో భాగంగా తనను కలిసిన భర్తకు చెప్పిన కవిత

కవిత యోగక్షేమాలను ఆమె భర్త అనిల్ అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలి, కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తామని కవితకు అనిల్ వివరించారు.

BRS MLC Kavitha in Tihar Jail : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టు కవితకు 14 రోజులపాటు జుడీషియల్ రిమాండ్ విధించడంతో ఢిల్లీ పోలీసు అధికారులు కవితను జైలు వ్యాన్ లో తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత తీహార్ జైలులోనే ఉండనున్నారు. తీహార్ జైలులో ఉన్న కవితను ఆమె భర్త అనిల్ ములాకత్ లో భాగంగా కలిశారు.

Also Read : Mlc Kavitha Arrest : కవితకు బెయిల్ వస్తుందా? ఏప్రిల్ 1న ఏం జరగనుంది? సర్వత్రా ఉత్కంఠ

కవిత యోగక్షేమాలను ఆమె భర్త అనిల్ అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలి, కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తామని కవితకు అనిల్ వివరించారు. ఏప్రిల్ 1న కోర్టులో జరిగే మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు కవితకు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తాను ధైర్యంగానే ఉన్నానని తెలిపినట్లు సమాచారం. పిల్లలను బెంగ పెట్టుకోవద్దని, చిన్న కొడుకు ఆర్య పరీక్షలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని భర్తకు కవిత చెప్పినట్లు తెలిసింది.

Also Read : Mlc Kavitha : ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనకు కోర్టు అంగీకారం.. జైల్లో ఆ వెసులుబాటు

లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పది రోజుల ఈడీ కస్టడీ అనంతరం కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విధించింది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులోని కాంప్లెక్స్ 6లో ఉన్నారు. ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి ఉంటున్నారు. తోటి ఖైదీలతో కవిత కలివిడిగా ఉంటున్నట్లు తెలిసింది. ఆమె జైలులో సాధారణ ఖైదీలాగే గడుపుతున్నారు. జైలు సిబ్బంది ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కవితకు కల్పించలేదని తెలుస్తోంది. కోర్టు ఆదేశాల ప్రకారం త్వరలో సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. అయితే, తొలిరోజు రాత్రి జైలు ఆహారమైన పప్పు, అన్నంను కవితకు అందజేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు