CPI Narayana: కవిత విచారణను లైవ్ టెలికాస్ట్ చేయండి.. దర్యాప్తు సంస్థల్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది: సీపీఐ నేత నారాయణ

ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించడంపై సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. ఈ విచారణను సీబీఐ లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

CPI Narayana: దర్యాప్తు సంస్థల్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు సీపీఐ నేత నారాయణ. ఎమ్మెల్సీ కవితపై సీబీఐ జరుపుతున్న విచారణను లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత విచారణ అంశంపై నారాయణ ఆదివారం మీడియాతో మాట్లాడారు.

Maharashtra: అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మహారాష్ట్ర మంత్రిపై ఇంకు చల్లిన వ్యక్తి

ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ఆయన విమర్శలు చేశారు. ‘‘రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలతో కేంద్రం దాడులు చేస్తోంది. దర్యాప్తు సంస్థల్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారిస్తోంది. కేంద్రం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తోంది. ఇప్పుడు కవితపై జరుగుతున్న విచారణను కూడా కక్ష సాధింపు చర్యగానే భావించాల్సి ఉంటుంది. అందుకే విచారణను లైవ్ టెలికాస్ట్ చేయాలి. అప్పుడే అసలు నిజాలు తెలుస్తాయి. న్యాయస్థానాలు కూడా సుప్రీంకోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటే, సీబీఐ విచారణను టెలికాస్ట్ చేయడంలో ఇబ్బంది ఏంటి? రహస్యంగా విచారణ జరిపితే.. బయటికొచ్చాక ఎవరి వాదన వాళ్లు వినిపిస్తారు.

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పోటెత్తిన ప్రయాణికులు.. గంటల తరబడి నిరీక్షణ.. ప్రయాణికుల ఆగ్రహం

అప్పుడు అది వినే ప్రజలు పిచ్చివాళ్లు అవుతారు. ఇలాంటి విచారణలు జరిగినప్పపుడు లైవ్ ఇవ్వడం ద్వారా విచారణలో ఏం జరుగుతుందో ప్రజలకు, రాజకీయ పార్టీలకు తెలుస్తుంది’’ అని నారాయణ వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కవితను ఆదివారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు