Maharashtra: అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మహారాష్ట్ర మంత్రిపై ఇంకు చల్లిన వ్యక్తి

అంబేద్కర్, మహాత్మా జ్యోతిభా ఫూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి చంద్రకాంత్ పాటిల్‌పై ఒక వ్యక్తి ఇంకు చల్లాడు. ఈ ఘటనతో మంత్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Maharashtra: అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మహారాష్ట్ర మంత్రిపై ఇంకు చల్లిన వ్యక్తి

Maharashtra: డా.బిఆర్.అంబేద్కర్, మహాత్మా జ్యోతిభా ఫూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి చంద్రకాంత్ పాటిల్‌పై ఒక వ్యక్తి ఇంకు చల్లాడు. పూనే జిల్లా, పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో ఒక కార్యక్రమానికి శనివారం మంత్రి హాజరవ్వగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Maharashtra: వేధింపుల్ని అడ్డుకున్నందుకు చిన్నారిని, ఆమె తల్లిని క్యాబ్‌లోంచి తోసేసిన ప్యాసింజర్లు.. చిన్నారి మృతి

శుక్రవారం ఔరంగాబాద్‪లో జరిగిన ఒక కార్యక్రమానికి మంత్రి పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మరాఠీలో మాట్లాడిన పాటిల్ అంబేద్కర్, జ్యోతిబాఫూలే గురించి వ్యాఖ్యానించారు. ‘‘ఫూలే, అంబేద్కర్‌లు విద్యా సంస్థల నిర్వహణ కోసం ప్రభుత్వాన్ని నిధులు అడగలేదు. వాళ్లు స్కూళ్లు, కాలేజీలకు నిధుల కోసం ప్రజల్ని అడుక్కున్నారు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే, పాటిల్ వ్యాఖ్యల్లో అడుక్కోవడం, భిక్షమెత్తుకోవడం అని అర్థం వచ్చేలా ఉండటంతో దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పలువురు దళిత నేతలు పాటిల్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. పింప్రి సహా అనేక చోట్ల నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం పింప్రి చించ్వాడ్ నగరానికి రాగా, ఒక వ్యక్తి ఆయనపై ఇంకు చల్లి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో మంత్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

PM Modi: మెట్రో రైలు టిక్కెట్ కొని పిల్లలతో కలిసి ప్రయాణించిన మోదీ.. వీడియో విడుదల

వెంటనే భద్రతా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ ఇంకు చల్లడం వల్ల తనకేమీ కాలేదని, షర్ట్ మార్చుకుని తిరిగి ఎప్పట్లాగే వెళ్లిపోతున్నానని చెప్పాడు. తాను అంబేద్కర్, ఫూలేను విమర్శించలేదని చెప్పాడు. ఈ అంశంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందించారు. పాటిల్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాడు. ప్రభుత్వాన్ని నిధులు అడగకుండానే విద్యాసంస్థల్ని అంబేద్కర్, ఫూలే వంటి వారు నిర్వహించారని పాటిల్ చెప్పినట్లు దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.