Maharashtra: వేధింపుల్ని అడ్డుకున్నందుకు చిన్నారిని, ఆమె తల్లిని క్యాబ్‌లోంచి తోసేసిన ప్యాసింజర్లు.. చిన్నారి మృతి

షేరింగ్ క్యాబ్‌లో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు తోటి ప్యాసింజర్లు. అంతేకాదు.. వారి వేధింపుల్ని అడ్డుకున్నందుకు ఆమెను, చిన్నారిని కారులోంచి బయటకు తోసేశారు.

Maharashtra: వేధింపుల్ని అడ్డుకున్నందుకు చిన్నారిని, ఆమె తల్లిని క్యాబ్‌లోంచి తోసేసిన ప్యాసింజర్లు.. చిన్నారి మృతి

Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది. షేరింగ్ క్యాబ్‌లో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ప్యాసింజర్లు, దీన్ని అడ్డుకున్నందుకు ఆ మహిళను, ఆమె చిన్నారి కూతురును బయటకు తోసేశారు. ఈ ఘటనలో పది నెలల వయసున్న చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఆమె తల్లి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Bride Suicide: పెళ్లికి ముందే పెళ్లికూతురు ఆత్మహత్య.. కాబోయే భర్త వేధింపులే కారణమా?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, పాల్ఘర్ జిల్లాలో, ముంబై-అహ్మదాబాద్ హైవేపై శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. పది నెలల చిన్నారితో ఉన్న ఒక మహిళ పెల్హర్ ప్రాంతం నుంచి పోషెరె ప్రాంతానికి వెళ్లేందుకు షేరింగ్ క్యాబ్ బుక్ చేసుకుంది. కారులో ఆమెతోపాటు మరికొంతమంది ప్యాసింజర్లు ఉన్నారు. కొంతదూరం వెళ్లిన తర్వాత క్యాబ్ డ్రైవర్‌తోపాటు ప్యాసింజర్లు కారులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె దీన్ని అడ్డుకుని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న ప్యాసింజర్లు వేగంగా వెళ్తున్న కారులోంచి పది నెలల చిన్నారిని బయటకు విసిరేశారు. వెంటనే మహిళను కూడా బయటకు తోసేశారు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. నిందితుల్ని ఇంకా గుర్తించాల్సి ఉంది.