Bride Suicide: పెళ్లికి ముందే పెళ్లికూతురు ఆత్మహత్య.. కాబోయే భర్త వేధింపులే కారణమా?

మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, ఆదివారం వేకువఝామున పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది.

Bride Suicide: పెళ్లికి ముందే పెళ్లికూతురు ఆత్మహత్య.. కాబోయే భర్త వేధింపులే కారణమా?

Updated On : December 11, 2022 / 10:32 AM IST

Bride Suicide: నిజామాబాద్ జిల్లా నవీపేటలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. కొద్దిసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది. రవళి అనే మహిళ పెళ్లికి ముందు ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి కూతురుగా ముస్తాబై ఉండగానే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

YS Sharmila: వైఎస్ షర్మిల దీక్ష భగ్నం.. అపోలో ఆస్పత్రికి తరలించిన పోలీసులు

కుటుంబ సభ్యులంతా పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, ఆదివారం వేకువఝామున రవళి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు రవళి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రవళి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రవళి చివరి ఫోన్ కాల్ కాబోయే భర్తతో మాట్లాడింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. కాగా, తన కూతురు ఆత్మహత్యకు కాబోయే భర్త వేధింపులే కారణమని రవళి తండ్రి ఆరోపిస్తున్నారు.

దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవళి తండ్రి ఫిర్యాదుమేరకు వరుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి రవళికి కాబోయే భర్త ఆమెను వేధిస్తున్నట్లు తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.