×
Ad

Local Body Elections: లోకల్ ఫైట్.. అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ ఆంక్షలు.. ఒక్కొక్కరు ఎంత ఖర్చు చేయాలంటే..

ఇక సర్పంచ్ అభ్యర్థుల ఖర్చులకు రెండు స్లాబులు విధించింది. ఇందులో 5వేల జనాభా పైబడిన గ్రామ పంచాయతీలకు..

Local Body Elections: తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ పలు నిబంధనలు పెట్టింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై రూల్స్ అండ్ రెగులేషన్స్ పాటించాలని సూచించింది. జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థి 4లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఎంపీటీసీగా పోటీ చేసే అభ్యర్థి లక్షన్నర రూపాయల వరకు ఖర్చు చేయొచ్చని చెప్పింది.

ఇక సర్పంచ్, వార్డులకు పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులకు రెండు స్లాబులు విధించింది. ఇందులో 5వేల జనాభా పైబడిన గ్రామ పంచాయతీలకు 2.5లక్షలు, 5వేల జనాభా లోపల గ్రామ పంచాయతీలకు లక్షన్నర.. 5వేల జనాభా పైబడిన వార్డు సభ్యులకు 50వేల రూపాయలు, 5వేల జనాభా లోపున్న వార్డు సభ్యులకు 30వేల రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవచ్చని సూచించింది. ఎన్నికల సంఘం సూచించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేసే అభ్యర్థులు డిస్ క్వాలిఫై అవుతారని ఎన్నికల సంఘం తెలిపింది.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు పలు ఆంక్షలు పెట్టింది ఈసీ. అభ్యర్థుల వ్యయానికి సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చింది. నామినేషన్ వేసిన దగ్గరి నుంచి ప్రచారం ముగిసేలోపు ఎంత ఖర్చు చేయాలి అనేదానిపై లిమిట్స్ పెట్టింది ఎన్నికల కమిషన్. తాము చెప్పిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే అభ్యర్థులు పోటీకి అనర్హులు అవుతారు.

Also Read: ప్రయాణీకులకు టీజీఎస్ఆర్టీసీ బంపరాఫర్.. త్వరలో ఆ కార్డులు వచ్చేస్తున్నాయ్.. వాళ్ల ఇబ్బందులు ఇక తొలగినట్లే..