Kishan Reddy
లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ యూత్ వింగ్‌లో కొత్త టీమ్ ను నియమించారు. బీజేవైఎం ప్రెసిడెంట్‌గా ఇప్పటికే సెల్వం మహేందర్ పేరు ప్రకటించారు.
ఇవాళ 76 మందితో యూవ మోర్చా టీమ్ ను ప్రకటించారు కిషన్ రెడ్డి. నామని మహేశ్ తో పాటు మరో ఎనిమింది మంది ఉపాధ్యక్షులు ఉంటారు. శ్యామల ప్రవీణ్ రెడ్డి సహా ముగ్గురు ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తారు. కార్యదర్శులుగా మరో ఎనిమిది మందిని ప్రకటించారు.
మొత్తం 77 మందితో బీజేవైఎం కొత్త టీం ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో యువతకు మరింత చేరువకావడమే లక్ష్యంగా కొత్త టీమ్ ను ప్రకటించారు. గత బీజేవైఎం కమిటీలో పనిచేసిన వారికి ప్రాధాన్యం తగ్గింది. ఎన్నికల వేళ తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
Also Read: సమ ఉజ్జీల సమరంలో గెలుపెవరిది? గన్నవరంలో టీడీపీ, వైసీపీ హోరాహోరీ పోరు