ప్రభుత్వ ఆసుపత్రిలో ఐఏఎస్ అధికారి భార్య డెలివరీ

గతంలోనూ పలువురు ఐఏఎస్ అధికారులు ఇలాగే చేసి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఐఏఎస్ అధికారి భార్య డెలివరీ

Updated On : August 15, 2025 / 1:12 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఓ ఐఏఎస్ అధికారి భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాన భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ భార్య మనీషా రాహుల్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో డెలివరీ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యున్నత వైద్య సేవలు అందుతున్నాయని తెలిపేందుకు ఇది ఉదాహరణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఐఏఎస్ అధికారి అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా కాన్పు కోసం తన భార్యను ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Also Read: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌ సాధించిన మైలురాళ్లు ఇవే.. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండేలా..

గతంలోనూ పలువురు ఐఏఎస్ అధికారులు ఇలాగే చేసి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కూడా తన భార్య ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రికే తీసుకెళ్లారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆమెకు డాకక్టర్లు సీ-సెక్షన్ సర్జరీ చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు.