Telangana Politics : ఆఫర్స్‌తో బలమైన నేతలకు గాలం.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్యే ఉండే పోటీ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపడటంతో త్రిముఖ పోటీగా మారింది. దీంతో రాష్ట్రంలో సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.

Telangana Politics

Telangana Politics : లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. ఓట్లు, సీట్లే లక్ష్యంగా పార్టీలన్నీ అమ్ముల పొదిలోని వ్యూహాల ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల బ్యాలెట్‌ ఫైట్‌తో స్టేట్‌లో పొలిటికల్‌ హీట్‌ పీక్స్‌కి చేరింది.

ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులు..
పార్లమెంట్‌ ఎన్నికలు, నేతల పార్టీ జంపింగులతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో అన్ని పార్టీలు పొలిటికల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేశాయి. అత్యధిక లోక్‌సభ స్థానాల్లో ఆధిపత్యం సాధించేందుకు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎత్తుకు పైఎత్తు వేయడంలో మునిగిపోయాయి.

రేవంత్ దూకుడు.. ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి..
ప‌దేళ్ళ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఫుల్‌జోష్‌లో ఉంది. 17 ఎంపీ స్థానాల్లో 14 స్థానాలకు తగ్గకుండా గెలవాలని టార్గెట్‌ పెట్టుకుంది. మరోవైపు సీఎం రేవంత్‌ రెడ్డి సైతం ఫుల్‌ లెంగ్త్‌ రాజకీయాలు షురూ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలకు గాలం వేస్తూ ఆపరేషన్‌ ఆకర్ష్‌ స్టార్ట్‌ చేశారు. దీంతో.. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్‌ గూట్లో వాలారు. లోక్‌సభ స్థానాల్లో ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. రేవంత్‌ దూకుడు పాలిటిక్స్‌తో ప్రతిపక్ష పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

చేరికలను ప్రోత్సహిస్తూ బలం పెంచుకుంటున్న బీజేపీ..
దేశవ్యాప్తంగా ఉన్న మోడీ క్రేజ్‌ని వాడుకునేందుకు తెలంగాణ బీజేపీ నాయకులు తమదైన స్టైల్లో ట్రై చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాజిటివ్‌ రిజల్ట్‌ దక్కించుకొని.. లోక్‌సభ ఎన్నికల్లో 10కి తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్‌ పెట్టుకుంది. రెండు పార్టీల నుంచి నేతల చేరికలను ప్రోత్సహిస్తూ తెలంగాణలో బలం పెంచుకుంటోంది. పలు పార్టీల నుంచి వచ్చిన నేతలకు కాషాయ కండువా కప్పి ఎంపీ టికెట్‌ ఇచ్చింది బీజేపీ. దీంతో కాంగ్రెస్‌లో డీల్ కుదరని గులాబీ నేతలు.. కాషాయ పార్టీ వైపు అడుగులు వేసేలా బీజేపీ నేతలు మంత్రాంగం చేస్తున్నారు.

క్యాడర్‌లో కాన్ఫిడెన్స్‌ కాపాడేందుకు కష్టపడుతోంది..
కాంగ్రెస్‌, బీజేపీల దూకుడు ఇలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తిన్న బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో కాన్ఫిడెన్స్‌ కాపాడేందుకు కష్టపడుతోంది. లోక్‌సభలో సత్తా చాటేందుకు శక్తిని కూడగట్టుకుంటోంది. లీడర్ల కండువా మార్పులతో ఎంపీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ తో కొత్త లుక్‌లో ముందుకెళ్తోంది బీఆర్‌ఎస్‌.

లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే కసితో మూడు పార్టీలు కష్టపడుతున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పొలిటికల్‌ గేమ్‌ స్పీడ్‌ పెంచాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్యే ఉండే పోటీ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపడటంతో త్రిముఖ పోటీగా మారింది. దీంతో రాష్ట్రంలో సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.

Also Read : పార్టీ మారిన ఆ ఐదుగురు నేతలకు లక్కీ ఛాన్స్..! 9మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రెడీ..!

 

ట్రెండింగ్ వార్తలు