Congress Mp Candidates : పార్టీ మారిన ఆ ఐదుగురు నేతలకు లక్కీ ఛాన్స్..! 9మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రెడీ..!

భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా డాక్టర్ సుమలత, వరంగల్ అభ్యర్థిగా పసునూరి దయాకర్..

Congress Mp Candidates : పార్టీ మారిన ఆ ఐదుగురు నేతలకు లక్కీ ఛాన్స్..! 9మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రెడీ..!

Congress Mp Candidates : తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది ఏఐసీసీ. మరో 9మంది అభ్యర్థులతో రెండో జాబితాను సిద్ధం చేసింది. ఏ క్షణమైనా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్ కానుంది. సెకండ్ లిస్టులో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా షెహవాజ్, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి పేర్లు కన్ ఫర్మ్ అయ్యాయి.

ఇక భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా డాక్టర్ సుమలత, వరంగల్ అభ్యర్థిగా పసునూరి దయాకర్, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెదక్ నుంచి నీలం మధును బరిలోకి దించనుంది కాంగ్రెస్. ముదిరాజ్ ఈక్వేషన్ తో నీలం మధు లక్కీ ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది.

రెండో జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఈ జాబితాపై క్లియరెన్స్ చేసి ఇవాళ్టి రాత్రికి లేదా రేపు ఉదయం రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. ఆయనకు సికింద్రాబాద్ టికెట్ కన్ ఫర్మ్ చేసినట్లు సమాచారం.

చేవెళ్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డి ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు చేవెళ్ల ఎంపీ టికెట్ కన్ ఫర్మ్ చేశారు. వాస్తవానికి వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న సునీతా మహేందర్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు చేసిన ఫ్లాష్ సర్వేలో సునీతా మహేందర్ రెడ్డి కంటే.. సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వే రిపోర్టులో తేలింది.

చేవెళ్ల నుంచి అనుకున్ను సునీతా మహేందర్ రెడ్డిని.. మల్కాజిగిరి నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించారు. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగుతారని మొదట్లో చర్చ జరిగింది. కొన్ని అనివార్య కారణాలతో ఆయనను పార్టీలోకి తీసుకోలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్టున్న నేత కావడంతో మల్కాజిగిరి టికెట్ ను సునీతా మహేందర్ రెడ్డికి ఖరారు చేసినట్లు సమాచారం. భువనగిరి టికెట్ కోసం హేమాహేమీలు పోటీ పడ్డారు. ఫైనల్ గా బీఆర్ఎస్ తరపున భువనగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పైళ్ల శేఖర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకుని ఆయనకు టికెట్ ఇవ్వాలని దాదాపుగా నిర్ణయం జరిగినట్లుగా పార్టీ వర్గాల సమాచారం.

Also Read : ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదు.. మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటు: ఎర్రబెల్లి