Bay Of Bengal : బంగాళాఖాతంలో అల్పపీడనం..మళ్లీ వర్షాలు, ఎక్కడెక్కడంటే

ఉత్తర, మధ్య బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 12, 13 తేదీల్లో జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Telangana Rain : బంగాళాఖాతంలో దగ్గరలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు మళ్లీ భయపడిపోతున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా భారీ వర్షాలతో తెలంగాణలో కొన్ని ప్రాంతాలు అస్తవ్యస్థమైన సంగతి తెలిసిందే. ప్రధానంగా వరంగల్, సిరిసిల్ల పట్టణం నీట మునిగిపోయింది.

Read More : Big Day : మరో ప్రాణం నిలబడింది..బిగ్ డే అన్న సోనూ సూద్

హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడిప్పుడే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా..ఉత్తర, మధ్య బంగాళాఖాతం దగ్గరలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు…ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 11న ఏర్పడే ఛాన్స్ ఉందని, అల్పపీడనం తర్వాత…48 గంటల్లో బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Read More : Bamma Bullet Bandi dance: బుద్దిగా కూర్చున్న తాత..‘బుల్లెట్ బండి’పాటకు డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ

ఈనెల 12, 13 తేదీల్లో జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 13వ తేదీన నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ లలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు