LRS deadline : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020, అక్టోబర్ 13వ తేదీ మంగళవారం ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాల్లో ఈ విషయంపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారని సమాచారం. 2020, అక్టోబర్ 15 గడువును మరో నెల వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది.
కొన్ని కారణాల వల్ల ఆస్తులను క్రమబద్ధీకరించడానికి దరఖాస్తులు సమర్పించలేకపోయారని, గడువు పొడిగించడం వల్ల వారికి మేలు చేకూరయ్యే అవకాశం ఉందని యోచిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఎల్ఆర్ఎస్ కు ఫుల్ రెస్పాండ్ వచ్చింది. 10 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. గడువు పొడిగించినట్లేతే..అనూహ్యంగా..దరఖాస్తుల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.
తుది ఆమోదం కోసం ముఖ్యమంత్రి వద్దకు ఫైల్ ను పంపినట్లు తెలుస్తోంది. గడువు ఎప్పటి వరకు పొడిగిస్తారనే దానిపై అధికారులు వెల్లడించడం లేదు. గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల నుంచి ఇప్పటి వరకు 11.57 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీతో సహా మున్సిపల్ కార్పొరేషన్ లో మరో 2.24 దరఖాస్తులు వచ్చాయి.
దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 118 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్రమంగా పుట్టుకొచ్చిన వెంచర్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసేందుకు తీసుకొచ్చిన లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) ఎంతో మందికి సంతోషానిచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్ లేకపోతే..రిజిస్ర్టేషన్‌లు జరిగే అవకాశం లేకపోవడం, నిర్మాణాలకు అనుమతించకపోవడం వంటి నిబంధనలతో ఆందోళనలో ఉన్న యజమానులు… దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే..కొంతమందిలో అవగాహన లేకపోవడంతో దరఖాస్తు చేసుకోవడం లేదని, గడువు పొడిగిస్తే..వారు దరఖాస్తు చేసుకొనే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1000, లే అవుట్ అప్లికేషన్ ఫీజు రూ. 10 వేలు.
రెగ్యులరైజేషన్ ఛార్జీలు 100 గజాలలోపు ప్లాట్లకు గజానికి రూ. 200.
100 నుంచి 300 గజాల వరకు రూ. 400 రెగ్యులరైజేషన్ ఛార్జీలు.
300 నుంచి 500 వరకు గజానికి రూ. 600 రెగ్యులరైజేషన్ ఛార్జీలు.
530 గజాలున్న ప్లాట్లకు రూ. 700 రెగ్యులరైజేషన్ ఛార్జీలు.