Madan Reddy : నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ నాకే వస్తుంది : ఎమ్మెల్యే మదన్ రెడ్డి

నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి చేశానని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తప్ప వేరే జెండా ఎగరదని పేర్కొన్నారు.

Madan Reddy : నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ నాకే వస్తుంది : ఎమ్మెల్యే మదన్ రెడ్డి

MLA Madan Reddy

Updated On : September 28, 2023 / 3:15 PM IST

Madan Reddy : నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు అన్ని విషయాలు తెలుసు అని ప్రకటించారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇతర పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు.

నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి చేశానని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తప్ప వేరే జెండా ఎగరదని పేర్కొన్నారు. ఇతర పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. గ్లోబల్ ప్రచారం నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

Harsha Kumar : చంద్రబాబు అరెస్ట్ ను జగన్ వాడుకుంటున్నారు : హర్షకుమార్