ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న వర్సెస్ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్‌పై బీజేపీ నాయకురాలు మాధవీలత కీలక కామెంట్స్ చేశారు. ఇవాళ 10టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాధవీలత మాట్లాడారు.
“వాళ్ల దగ్గర ఉన్నంత టైం పాస్ పనులు చేసే టైం నా దగ్గర లేదు.. ఓపెన్ గా చెబుతున్నాను. నాకు తీన్మార్ మల్లన్న అర్థం కాలేదు. నాకు ఆ కవిత అర్థం కాలేదు. ఎందుకంటే ఒక పదవి, ఒక పవర్ చేతిలోకి వచ్చినప్పుడు అసలు ఇన్ని కుంభకోణాలలో ఇరుక్కోవడం ఏంటి? ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది అనుకోవాలి.. సేవ చేయాలి.
అప్పట్లో ట్యాంక్ బండ్ మీద కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలను రెచ్చగొట్టి ట్యాంక్ బండు మీద విగ్రహాలను సైతం విరగగొట్టించారు. అది పబ్లిక్ ప్రాపర్టీ.. మీరు ముందు పెట్టింది ఎవరిని? అమాయక స్టూడెంట్స్ ని. అలాంటి ఫ్యామిలీ నుంచి ఆ మహాతల్లి కవిత వచ్చారు.. ఇప్పుడు ఇష్యూ ఎత్తుతున్నది ఎవరు?
కవిత తరఫు వాళ్లేగా? అలాగే, తీన్మార్ మల్లన్న కూడా రాజకీయాలని వాడుకుంటున్నాడు. కవిత వాళ్ల నాన్న, వాళ్ల అన్న, అందరూ రాజకీయ నాయకులే. ఇద్దరూ దొందు దొందే. దాని మధ్యలో పడడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అటువంటి పాలిటిక్స్ నాకు రావు. ఆ పాలిటిక్స్ నేను చేయలేను. నేను కనుక కవిత ప్లేస్ లో ఉండి అట్లా ఒక పొలిటికల్ పార్టీ ఇంటి పిల్లని అయి ఉండి.. నాకు అలా పవర్ ఉండి ఉంటే ఎంతో ప్రజాసేవ చేయగలిగి ఉండేదాన్ని.
నేను ఏమీ లేకుండానే రోజు పొద్దున్న లేచి తపన పడుతూ ఉంటాను ప్రజాసేవ చేయడానికి. కాబట్టి వీళ్లు ఎవరో, వీళ్ల మనస్తత్వాలు ఏమిటో, వీళ్లు ఎందుకు ఎందుకు ఇలా ప్రజలను దోచుకుంటారో.. కేవలం రాజకీయంగా డబ్బులు దోచుకోవడం కోసం ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో ఏమో.. వారి వ్యక్తిత్వం కూడా నాకు అర్థం కాదు” అని అన్నారు.
బీసీల రిజర్వేషన్‌పై కాంగ్రెస్ ఉద్దేశము ఇదే..
తెలంగాణలో బీసీల రిజర్వేషన్ ఇష్యూ అనేది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. బీసీల రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకమా అంటూ కాంగ్రెస్ చేస్తున్న కామెంట్లపై మాధవీలత స్పందించారు.
“కాంగ్రెస్ వాళ్లు ప్రతిసారి తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని చేసి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్లకి బేసిక్ గా సబ్జెక్ట్ కంటెంట్ లేదు. 2024 ఎలక్షన్స్ సమయంలో వాళ్లు ఏం చేశారు? మార్ఫింగ్ చేసి అమిత్ షా మీద ట్రోల్ చేశారు. మనకి ఆల్రెడీ ఒక బీసీ రిజర్వేషన్ ఉంది.
చదువు రాని బీద వాళ్లకి ఓ విషయం తెలియదు. కాంగ్రెస్ ఉద్దేశము ఏంటంటే ఎగ్జిస్టింగ్ బీసీలకు న్యాయం చేయడం కాదు.. వీళ్ల దగ్గర నుంచి లాగేసుకొని ముందు ముస్లింలల్లో ఆ ఎంఐఎం పార్టీని హ్యాపీ చేయడానికి, తద్వారా వాళ్లతో కూటమితో ఇంకా ముందుకు వెళ్లడానికి వీళ్లు ముస్లింల బీసీల రిజర్వేషన్ ని కోరుతున్నారు. ఇది ఈసారి జరగనివ్వం.. బీసీల పట్ల అన్యాయం జరగకూడదంటే.. అసలు ఆ బీసీలకు ఇస్తున్నామంటున్న ప్రయోజనాలు వారికి అందుతున్నాయా? బీసీ ఉద్యోగాలు ఇస్తున్నారా? లేదా?
రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే దాన్ని బీజేపీ క్వశ్చన్ చేస్తుందా? కోర్టుకి వెళ్తుందా? అన్న ప్రశ్నకు మాధవీలత స్పందిస్తూ.. “దీనికి నా కన్నా బాగా సమాధానం చెప్పే వ్యక్తి డాక్టర్ లక్ష్మణ్. ఎందుకంటే ఆయన ఆల్ ఇండియా ఓబీసీ సెల్ అధ్యక్షుడు కాబట్టి” అని అన్నారు.