Madhu Yaskhi Goud: తెలంగాణలో కాంగ్రెస్ ప్రస్తుత టార్గెట్ ఇదే..: మధుయాష్కీ గౌడ్

పీసీసీ చీఫ్‌ను అప్పటివరకు వరకు కొనసాగిస్తామన్నారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చింది బీజేపీ గెలుపుకోసం కాదని, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మార్చడానికని చెప్పారు.

Madhu Yaskhi Goud

ప్రతిపక్ష పార్టీలపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెసే తమ ప్రత్యర్థి అని బీజేపీ, బీఆర్ఎస్ భావిస్తున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ టార్గెట్ 15 పార్లమెంట్ స్థానాలని తెలిపారు.

టీపీసీసీ అధ్యక్షుడిని ఆ ఎన్నికల వరకు కొనసాగిస్తామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలపై సమీక్ష జరుపుతామని తెలిపారు. బీజేపీ నాయకులు తమ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. ఇతర ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు.

కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకుని బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం కావడంపై స్పందించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. బీజేపీ నేతల కన్ఫ్యూజన్‌ను క్లియర్ చేయడానికే అమిత్ షా వచ్చారని చురకలంటించారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చింది బీజేపీ గెలుపుకోసం కాదని, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మార్చడానికని చెప్పారు.

Vasantha Krishna Prasad : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎం జగన్ నుంచి పిలుపు.. ఏం జరుగుతోంది