×
Ad

Madhu Yaskhi Goud: ఆనాడు బీఆర్ఎస్ విలీనానికి అడ్డంకి ఎవరు? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు

అప్పుడు పీసీసీ అధ్యక్ష ఎన్నిక కూడా తప్పు. జైపాల్ రెడ్డినో మరొకరినో చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది.

Madhu Yaskhi Goud: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పలు అంశాలపై మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనానికి ఎవరు అడ్డుపడ్డారు? కాంగ్రెస్ లో అప్పటి టీఆర్ఎస్ విలీనం ఎందుకు ఆగింది? ఆ సమయంలో అసలేం జరిగింది? అనే అంశంపై ఆయన స్పందించారు.

”తెలంగాణ ఏర్పాటు సందర్భంగా కేసీఆర్ తన కుటుంబంతో కలిసి సోనియా గాంధీని కలిశారు. అప్పటి టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పారు. కానీ, సోనియా గాంధీని కలిసినప్పుడు.. ముఖ్యమంత్రి కావాలి అనేది నా జీవిత లక్ష్యం, నా ఆశ అని చెప్పారు. దాంతో మా ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ని కలవాలని సోనియా ఆయనతో చెప్పారు. దిగ్విజయ్ సింగ్ స్వతహాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి వ్యతిరేకం. సోనియా గాంధీ ఆదేశించింది కనుక మేము తెలంగాణ ఇస్తున్నాం తప్ప మరో కారణం లేదన్నారు. మధ్యప్రదేశ్ విభజన జరిగి నష్టపోయాం అని దిగ్విజయ్ సింగ్ చెప్పేవారు.

కేసీఆర్ వెళ్లి దిగ్విజయ్ సింగ్ ని కలిశారు. ఆ నెక్ట్స్ రోజే బీఆర్ఎస్ ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అది రాంగ్ స్ట్రాటజీ. నేను నా పార్టీ విలీనం, అలయన్స్ కి రెడీగా ఉన్నాను అని కేసీఆర్ చెప్పినప్పుడు చేరికలు ఏంటి అని రెండో మీటింగ్ కి వెళ్లలేదు. తెలంగాణ ఇచ్చాం కాబట్టి మనం గెలుస్తాం అని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అనుకుంది.

అప్పుడు పీసీసీ అధ్యక్ష ఎన్నిక కూడా తప్పు. జైపాల్ రెడ్డినో మరొకరినో చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. కొన్ని రాజకీయ ఎత్తుగడల్లో కొన్ని తప్పొప్పులు జరిగిపోయాయి. తెలంగాణ ఇచ్చినా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అదొక కారణం. మరోక కారణం.. తెలంగాణ నేను తెచ్చాను నాకు ఓటు వేయండి అని కేసీఆర్ అడగలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తా, మూడు ఎకరాలు ఇస్తా, లక్షల ఉద్యోగాలు ఇస్తా అని వాగ్దానాలు ఇచ్చారు. ప్రజలు వాగ్దానాలపైనే ఓటు వేస్తారు” అని మధుయాష్కీ అన్నారు.

Also Read: 3 నెలల్లోగా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి కూలుస్తారు- మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు