3 నెలల్లోగా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి కూలుస్తారు- మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

ఈ జీవో నెంబర్ 9 నిలబడదని నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది.

3 నెలల్లోగా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి కూలుస్తారు- మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

Updated On : October 26, 2025 / 9:03 PM IST

Komatireddy Rajagopal Reddy: రేవంత్ సర్కార్ పై మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ చీఫ్ కపిలవాయి దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నల్గొండ నుంచే సంక్షోభం పొంచి ఉందన్నారు. సామాజిక చైతన్య రథ యాత్రలో భాగంగా నల్గొండలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. 3 నెలల్లోగా ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డితో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు.

”3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తాడాయన. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. నాకు తెలిసిన వాళ్లే 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డితో టచ్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్లా పైసలు లేవు. ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఇంట్లో పడుకోవడం బెటర్. మూడు నెలల్లోగా మన నల్గొండ నుంచే ఈ ప్రభుత్వం పెద్ద సంక్షోభంలోకి నెట్టవేయబడుతుంది. ప్రభుత్వం కూలిపోవడం గ్యారెంటీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసం చేశారు. రిజర్వేషన్లపై జీవో ఇచ్చారు.

ఈ జీవో నెంబర్ 9 నిలబడదని నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన 50 పాయింట్ కి వ్యతిరేకంగా ఉంది. కోర్టు స్టే ఇచ్చింది. ఆరు వారాల గడువులో నాలుగు వారాలు అయిపోయినట్లుంది. ఇంకో రెండు వారాల తర్వాత చూడండి. కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ పెట్టుకుని జీవోని విత్ డ్రా చేసుకుంటున్నాం అంటుంది” అని దిలీప్ కుమార్ అన్నారు.

Also Read: తెలంగాణ మంత్రుల పంచాయితీపై అధిష్టానం ఆరా.. వరుస పరిణామాలపై ఏం జరిగిందంటే?