Maha Shivratri 2024: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు

ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది.

Maha Shivratri 2024: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం స్వామివారికి ప్రభుత్వం తరఫున తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

అలాగే, ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 2.30 గంటల వరకు స్థానిక ప్రజలకు దర్శన సౌకర్యం కల్పిస్తారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.

రేపు సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు శివ దీక్ష స్వాములు దర్శనం చేసుకోవచ్చు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మహా లింగార్చన జరుపుతారు. రేపు రాత్రి 11.30 గంటలకు లింగోద్భవం ఉంటుంది.

Maha Shivratri 2024: శివుడి 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవాల్సిందే..

ట్రెండింగ్ వార్తలు