Kukatpally : కూకట్‌పల్లిలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం..
Major Fire Breaks Out In Kukatpally : హైదరాబాద్ నగర పరిధిలోని కూకట్‌పల్లి ప్రాంతం ఆస్బెస్టాస్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Updated on- November 9, 2026 / 07:27 AM IST
Major Fire Breaks Out In Kukatpally
Major Fire Breaks Out In Kukatpally : హైదరాబాద్ నగర పరిధిలోని కూకట్‌పల్లి ప్రాంతం ఆస్బెస్టాస్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున పేపర్ టీ కప్పులు, ప్లేట్స్ తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలుకాస్త పక్కనే ఉన్న నెయ్యి, కుర్‌కురే, హల్దీరామ్ స్టాక్ గోదాములకు వ్యాపించడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
Also Read : Weather Forecast : తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మారిన వాతావరణం.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇదే!
అగ్నిప్రమాద ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన నాలుగు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ, భారీగా ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగి ఉండొచ్చునని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మరోవైపు.. హైదరాబాద్ శివారు ప్రాంతం మైలార్‌దేవ్‌పల్లిలోనూ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓల్డ్ విలేజ్ లోని డెకరేషన్ గోదాములో భారీగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా సికింద్రాబాద్ బండిమెట్‌లోని డిస్ట్రిబ్యూటర్ డ్రగ్‌మార్ట్‌లో, బేగంబజార్‌లోని ఓ భవనంలో బాణసంచా నిప్పులుపడి మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఆస్తినష్టం భారీగా సంభవించినట్లు బాధితులు వాపోతున్నారు.
