×
Ad

Malla Reddy : మాజీ ఎమ్మెల్యే మైక్ లాగేసిన మంత్రి మల్లారెడ్డి

Malla Reddy : తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురించి మంత్రి మల్లారెడ్డి ప్రస్తావించకపోవడంపై సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Published On : April 16, 2023 / 09:19 PM IST

Malla Reddy

Malla Reddy : మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం రసాభాసగా మారింది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతుండగా.. మంత్రి మల్లారెడ్డి మైక్ లాక్కుకున్నారు. వేదికపైనే సుధీర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ ని ఆహ్వానించకపోవడంతో వివాదం చెలరేగింది.

Also Read..Etala Rajender : సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

దీంతో పాటు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురించి మంత్రి మల్లారెడ్డి ప్రస్తావించకపోవడంపై సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి మైక్ లాక్కున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సర్ది చెప్పారు.

Also Read..Puvvada Ajay Kumar: సీఎం కేసీఆర్‌తో ఎవరైనా పెట్టుకుంటే అంతే..: మంత్రి పువ్వాడ

మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి మొత్తం తానే చేసినట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పుకుంటున్నారని సుధీర్ రెడ్డి విమర్శించారు. తన హయాంలోనూ అభివృద్ధి జరిగిందని, ఆ విషయాన్ని మంత్రి ప్రస్తావించకపోవడం దారుణం అన్నారు. సుధీర్ రెడ్డి అలా అనడంతో మంత్రి మల్లారెడ్డికి కోపమొచ్చింది. వెంటనే సుధీర్ రెడ్డి చేతి నుంచి మైక్ లాగే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. ఏం జరుగుతుందో అర్థం కాక అంతా బిక్కమోహాలు వేశారు. ఇంతలో వేదికపైనే ఉన్న ఎమ్మెల్సీ పల్లా.. జోక్యం చేసుకున్నారు. ఇద్దరికీ సర్ది చెప్పారు. వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చేశారు.