Etala Rajender : సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

8 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేసిన వందల కోట్లు ఎక్కడివని నిలదీశారు.

Etala Rajender : సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

Etala Rajender

Etala Rajender : సీఎం కేసీఆర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో బెదరని వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. సర్పంచ్ మహేందర్ కేసీఆర్ డబ్బులకు అమ్ముడు పోకుండా…సైకోలకు బెదరలేదన్నారు. వీణవంకలో వేరే పార్టీ జెండాలు ఉండవద్దట అని అన్నారు. వేల ఎకరాల భూమి ఉన్నోడికి రైతు బందు ఎలా ఇస్తావన్నందుకు మెడలు పట్టి బయటకు వెల్లగొట్టాడని పేర్కొన్నారు.

తన సంపాదనపై ఉక్కు పాదం మోపాడని అన్నారు. 20ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుకపై ఎవరిని ఎంటర్ కానియ్యలేదని చెప్పారు. మానేరు నది చేర బట్టి…కేసీఆర్ బంధువులు మెషిన్లు పెట్టి ఇసుకను తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ‘ఎవడ్రా కొడకా? మా సొమ్ముతో నువ్ బతుకుతున్నావ్’ అని అన్నారు. కరీంనగర్ లో 2006లో నిలబడిన నాడు…ఆనాటి ప్రభుత్వం నిన్ను ఓడగొట్టాలని రాజశేఖర్ రెడ్డి కోట్లు పంచాడు… డబ్బులు తీసుకొని ఓట్లు వేయాలన్నావు కదా కేసీఆర్ అని నిలదీశారు.

Eatala Rajender: ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకొస్తారు.. మునుగోడు హామీల అమలేది: ఈటల రాజేందర్

8 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేసిన వందల కోట్లు ఎక్కడివని నిలదీశారు. తమ నోరు…కడుపు కొట్టి అక్రమంగా సంపాదించిన డబ్బు బెంగాల్, బీహార్ కు పంపిస్తావా అని అడిగారు. తాను అంటున్న మాటలపై అబిడ్స్ లో లేదా హుజురాబాద్ లో చర్చకు సిద్ధమన్నారు. నువ్వు వస్తావా? నీ బానిసలు వస్తారా? అని అన్నారు. ప్రాణానికి వేళ కట్టే మూర్ఖపు నాయకుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు.

డబుల్ బెడ్ రూమ్, మూడెకరాల భూమి అవ్వలేదు, దళిత బందు పూర్తిగా ఇవ్వలేదని విమర్శించారు. 10లక్షల రూపాయలు దళిత బిడ్డల పంచే వరకు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టవద్దన్నారు. మునుగోడు లో గిరిజన బందు అన్నాడని.. ఇంత వరకు జీ.ఓ రాలేదని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ దళిత బిడ్డల అందరికీ దళిత బందు రాకపోతే కేసీఆర్ భరతం పడతామని హెచ్చరించారు. చదువుకున్నోడికి నౌకరి వస్తదనుకున్నా… కానీ, డబ్బులు ఉన్నోడికి వస్తున్నాయని తెలిపారు.

EetelaRajender slams KCR: ఇలాంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి నాయకత్వం వహిస్తానంటున్నారు: ఈటల

పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని వెల్లడించారు. పేపర్ లీకేజీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పరీక్షలు నిర్వహించాలని కోరారు. అహంకార పూరితంగా వ్యవవహరించిన సీఐని సస్పెండ్ చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. సీఐని సస్పెండ్ చేసే వరకు ధర్నా కొనసాగుతోందని తేల్చి చెప్పారు.

నందిపేట ఊరిలో సర్పంచ్ దంపతులు పెట్రోల్ పోసుకొని తగలబడతా అని పోయారని తెలిపారు. సర్పంచ్ లు అప్పుల బాధలో ఇరుక్కుపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. కార్యదర్శులను ఏమి రా అంటున్నాడు… కేసీఆర్ మీ నాయకులకు పద్ధతి నేర్పు అని సూచించారు. ముందు మూడు…వెనక మూడు పోలిసు వాహనాలు పెట్టుకొని దౌర్జన్యం చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.