Bhatti Vikramarka On Farmers
Bhatti Vikramarka On Farmers : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన, తెలంగాణ ప్రభుత్వంపైన కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ లు రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఎరువుల ధరలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయని.. మూడేళ్ల క్రితం రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ రుణమాఫీ చేయలేదన్నారు. నాలుగేళ్లు అయినా మాఫీ కాలేదన్నారు.
రుణమాఫీ చేయనందుకు సీఎం కేసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో పంట నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాము పంట భీమా ఇచ్చామని, కానీ తెలంగాణలో రైతులను గాలికి వదిలేశారని వాపోయారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు రైతుల ఆదాయం సగానికి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రైతుల జాబితా లేదని బీజేపీ చెప్పిందన్నారు. రాహుల్ గాంధీ సభకు నల్గొండ నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.(Bhatti Vikramarka On Farmers)
Revanth Reddy On Farmers : వచ్చేది సోనియమ్మ రాజ్యమే.. రైతులకు ఏం చేస్తామో చెప్తాం-రేవంత్ రెడ్డి
”కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచాయి. ఈ యాసంగి సీజన్ లో సుమారు 17 లక్షల ఎకరాల్లో రైతులు ఎలాంటి పంట పండించలేదు. రైతులు రెండో పంట వేయకుండా ఆదాయాన్ని కోల్పోయారు. రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఆలస్యంగా వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించడంతో ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులు నష్టపోయారు. కేసీఆర్ ముందు చూపు లేని కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. అడ్డగోలుగా అప్పులు తెచ్చిన కేసీఆర్ సర్కార్ రైతు రుణ మాఫీ చేయలేదు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. కానీ రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో పంట భీమా పథకం ఉండేది. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం పంటల భీమా పథకం అమలు చేయడం లేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మోదీ హమీ ఇచ్చారన్నారు. కానీ ఒక్క పైసా ఆదాయం రైతులకు రెట్టింపు అయిందా?” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
రాహుల్ సభను విజయవంతం చేయాలి. ఏ ఒక్కరితోనో ఇది జరగదు. అందరూ కలసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఉదయం నుండి అన్ని జిల్లాల గురించి చర్చించాం.(Bhatti Vikramarka On Farmers)
భట్టి విక్రమార్క..
వరంగల్ లో రాహుల్ గాంధీ సభ విజయవంతం చేయాలి. కాంగ్రెస్ సిద్దాంతాలు నమ్మే వాళ్లందరూ రావాలి. రైతులు, రైతు కూలీలు అంతా రాహుల్ సభకి రండి. వ్యవసాయంపై కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది సభలో చెప్తాం. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన సబ్సిడీలన్నీ బంద్ అయ్యాయి. రుణమాఫీ భారం లక్ష పోయి నాలుగు లక్షలు అయ్యింది. మేము పంచిన భూములు.. ప్రభుత్వం ప్లాటింగ్ చేస్తుంది. వ్యవసాయ రంగంపై ఏం చేస్తాం అనేది రాహుల్ గాంధీ సందేశం ఇస్తారు.
congress: రాహుల్ గాంధీ పర్యటన.. సమావేశమైన టీపీసీసీ
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో భరోసా నింపేందుకే రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సబ్సిడీతో ఎరువులు, విత్తనాలు, పలు పరికరాలను ఇచ్చిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ, రైతుల రుణాలను ఇంకా మాఫీ చేయలేదన్నారు. రుణ భారం రూ.లక్ష దాటి రూ.4 లక్షలకు చేరిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలను అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పంచిన భూముల్లో తెలంగాణ ప్రభుత్వం ప్లాటింగ్ చేస్తోందన్నారు.