Revanth Reddy On Farmers : వచ్చేది సోనియమ్మ రాజ్యమే.. రైతులకు ఏం చేస్తామో చెప్తాం-రేవంత్ రెడ్డి

దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. రాహుల్ సభ ద్వారా.. రైతులకు ఏం చేస్తామో చెప్తామన్నారు.(Revanth Reddy On Farmers)

Revanth Reddy On Farmers : వచ్చేది సోనియమ్మ రాజ్యమే.. రైతులకు ఏం చేస్తామో చెప్తాం-రేవంత్ రెడ్డి

Revanth Reddy On Farmers

Updated On : April 23, 2022 / 8:28 PM IST

Revanth Reddy On Farmers : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అందమైన అబద్ధాలతో పూత పూసి కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదన్నారు. గిట్టుబాటు ధర లేక 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైం రికార్డు బ్యూరో ప్రకటించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నాలుగేళ్లలో 74వేల మంది రైతులు చనిపోయారని, వారికి రైతుబంధు ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తానని చెప్పి.. చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో చిరుధాన్యాల సాగు కనుమరుగైందని రేవంత్ రెడ్డి వాపోయారు. తోటలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Palla Rajeshwar Reddy : జైలుకు వెళ్లొచ్చినా రేవంత్ రెడ్డి తీరు మారలేదు : పల్లా

”ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ రాజకీయ క్రీడల్లో భాగంగా వరి పండించే రైతులతో చెలగాటం ఆడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వరి ధాన్యం సమస్య తెలంగాణలో ఎందుకు ఉంటుంది? గల్లీలో, ఢిల్లీలో ఇద్దరూ డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆర్ తీరుతో వానాకాలం సీజన్ లో వందలాది మంది రైతులు చనిపోయారు. ఇప్పుడు గోనె సంచులు, ట్రాన్స్ పోర్ట్ లేకుండా కుట్ర చేశారు. ఇప్పటికే రైతులు మూడు వేల కోట్లు నష్టపోయారు.(Revanth Reddy On Farmers)

మిల్లర్లు సేకరించిన ధాన్యానికి అధిక ధర ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఎఫ్ సీఐకి బియ్యం ఇవ్వకుండా రూ.3 వేల కోట్ల స్కాం చేశారు. ఈ స్కామ్ పై సీబీఐ విచారణ చేయాలి. సీఎస్ ఆధ్వర్యంలో దోపిడీకి కొత్త స్కెచ్ వేశారు. రూ.2,800 కోట్లలో కేసీఆర్ కుటుంబం‌, మిల్లర్ల దోపిడీ ఎంతనేది తేలాలి” అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

” రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో.. పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించాం. మే 6, 7 తేదీలలో పర్యటన నేపథ్యంలో సుదీర్ఘంగా చర్చించాం. రాహుల్ సభ ద్వారా.. త్వరలో రానున్న సోనియమ్మ రాజ్యంలో రైతులకు ఏం చేస్తామో చెప్తాం. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యుత్ ఇచ్చాం. మద్దతు ధర, రైతు పాలసీలను చేశాం. గతంలో కాంగ్రెస్ తెచ్చిన రైతు పాలసీలకు మోదీ, కేసీఆర్ తూట్లు పొడిచారు. బీజేపీ, టీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలను రాహుల్ సభ ద్వారా ఎండగడతాం.

లక్షలాది మంది రైతులతో కదం తొక్కుతాం. మే 7 న రాహుల్ గాంధీ హైదరాబాద్ లో ఉంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యార్థులను కలవడానికి రాహుల్ గాంధీ వస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అధికారికంగా జరిగేలా సహకరించాలి. ఆర్ట్స్ కాలేజ్ వద్దకు రాహుల్ గాంధీ రావాలని మేమంతా తీర్మానం చేసుకున్నాం. రాహుల్ సభను తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నాం” అని రేవంత్ రెడ్డి చెప్పారు.(Revanth Reddy On Farmers)

congress: రాహుల్ గాంధీ పర్యటన.. సమావేశమైన టీపీసీసీ

మరోవైపు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ కౌన్సిల్ తో ఒకే రోజు విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అవకతవకలు జరగలేదని నిరూపితమైతే.. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు.