Omicron
Omicron : ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కొన్ని దేశాలు ఇప్పటికే ట్రావెల్ బ్యాన్ విధించాయి. భారత్‌కు మాత్రం రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కెన్యా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఒమిక్రాన్ బాధితుడు కనిపించడం లేదంటూ వైద్య శాఖాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. కెన్యాకు చెందిన అబ్దుల్లాహి యారో ఇబ్రహీం (44) ఈ నెల 14న నగరానికి వచ్చాడు. అదే రోజు విమానాశ్రయంలో అతడికి పరీక్షలు నిర్వహించగా.. ఫలితాలు ఈ నెల 16న అతడికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది.
చదవండి : Omicron Variant: భారత్‌లో రోజుకు 14లక్షల కేసులు నమోదయ్యే అవకాశం
అతడు టోలిచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్నట్లుగా తెలుసుకొని అక్కడికి వెళ్లారు అధికారులు. అక్కడ అతడి ఆచూకీ లేకపోవడంతో.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా అపోలో ఆస్పత్రి సమీపంలోని ఓ గెస్ట్‌హౌజ్‌లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వైద్యశాఖ సిబ్బంది సాయంతో టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతడితోపాటు నూర్ అనే వ్యక్తి ఉండటంతో అతడికి కూడా ఒమిక్రాన్ సోకి ఉంటుందని అనుమానంతో టీమ్స్‌కు తరలించారు.
చదవండి : Omicron Cases: భారత్‌లో పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. కమ్యునిటీ ట్రాన్స్‌మిషన్ స్థాయిలో ఉందా?
చదవండి : Omicron Cases In India : దేశంలో 101 కి చేరిన ఒమిక్రాన్ కేసులు..కేంద్రం కీలక సూచనలు