Maoists : 25మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాపారులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని వ్యాాపారులను మావోయిస్టులు హెచ్చరించారు.

maoist

Maoists Kidnapped Traders : తెలంగాణలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. 25మంది భద్రాద్రికొత్తగూడెం జిల్లా వ్యాపారులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని మావోయిస్టులు హెచ్చరించి వదలిపెట్టారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 25 మంది చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొల్లపల్లికి చెందిన వ్యాపారులుగా గుర్తించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మావోయిస్టులు వ్యాపారస్తులను కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది.

KTR : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి : మంత్రి కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మాక్ పోలింగ్ అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. డిసెంబర్ 3న ఓట్ల కౌంటింగ్ జరుగునుంది. 119 నియోజకర్గాల్లో 2,290 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.

పోలీసుల నిఘా నీడల పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. లక్షమంది పోలీస్ సిబ్బంది ఎన్నికల్లో ఉన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు