KTR : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి : మంత్రి కేటీఆర్

ప్రజల చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా కానివ్వొద్దని సూచించారు. అందుకే ప్రజాస్వామ్య పండుగలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

KTR : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి : మంత్రి కేటీఆర్

Minister KTR (1)

KTR Appeal People : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ఓటు పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలని కోరారు. ప్రజలు వేసే ఓటు తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలన్నారు. ఓటు తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలని ఆకాక్షించారు. వ్యవసాయ విప్లవానికి వెన్నెముకగా నిలవాలని సూచించారు.

ఓటు మహిళల ముఖంలో చెరగని చిరునవ్వులు నింపాలన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాల అక్షయపాత్ర కావాలని కోరారు. సబ్బండ వర్ణాల్లో సంతోషాన్ని పదిల పరచాలని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా, సగర్వంగా ఎగరేయాలని పేర్కొన్నారు.

Nagarjunasagar Project : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద మరోసారి ఉద్రిక్తత.. 13వ నెంబర్ గేటు వరకు చొచ్చుకెళ్లి ఎస్పీఎఫ్‌ పోలీసులపై ఏపీ పోలీసులు దాడి

తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని, ప్రజల బతుకు చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రజల చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా కానివ్వొద్దని సూచించారు. అందుకే ప్రజాస్వామ్య పండుగలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ముచ్చటగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మాక్ పోలింగ్ అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. డిసెంబర్ 3న ఓట్ల కౌంటింగ్ జరుగునుంది. 119 నియోజకర్గాల్లో 2,290 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.

Maoists : 25మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాపారులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

పోలీసుల నిఘా నీడల పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. లక్షమంది పోలీస్ సిబ్బంది ఎన్నికల్లో ఉన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతోంది.