Manchiryal
Mancherial District : కాసేపట్లో తాళి కట్టబోతాడు. ఆమె ఎంట్రీతో సీన్ రివర్స్ అవుతుంది. తనను ప్రేమించాడని..మోసం చేసి..మరొకరి మెడలో ఎలా తాళి కడుతావంటూ ఫైర్ అవుతుంది. వెంటనే పోలీసుల ప్రవేశం..పెళ్లి దుస్తుల్లో ఉన్న వరుడిని తీసుకెళుతుంటారు. ఈ సీన్స్ సినిమాల్లో చూస్తుంటాం. కానీ..రియల్ లైఫ్ లో జరుగుతుంటాయి. తాజాగా మరొకటి చోటు చేసుకుంది. పెళ్లి మండపం ఎంతో సందడిగా ఉంది. బాజాభజంత్రీలు, బంధుగణం, అతిథిగణంతో అంతా సందడిగా ఉంది. కాసేపట్లో ఒక్కటవ్వబోతున్న ఆ జంటను ఆశీర్వదించడానికి వెయిట్ చేస్తున్నారు. తాళికట్టే సమయానికి ఆమె ఎంట్రీతో అంతా మారిపోయింది. దీంతో పీటలపై పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది.
Read More : Chandigarh MC Poll Results : బీజేపీ,కాంగ్రెస్ కి ఝలక్..చంఢీగఢ్ ఎన్నికల్లో ఆప్ సత్తా
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోమటిచేను గ్రామానికి చెందిన దుర్గం వినోద్ పదేళ్లుగా చైతన్యతో ప్రేమాయణం సాగించాడు. ఆమెను కాదని జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన మరో యువతి హర్షశ్రీని ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యాడు. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. 2021, డిసెంబర్ 27వ తేదీ సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఐ హాల్లో పెళ్లి వేడుక జరుగనుంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రియురాలు చైతన్య పెళ్లి జరుగుతున్న మండపం వద్దకు వచ్చారు.
Read More : Sankranti 2021 : సంక్రాంతి రద్దీ..జనవరి రెండో వారం వరకు స్పెషల్ రైళ్లు ఫుల్
మొదటి ప్రియురాలు చైతన్య రాకను గమంచిన ప్రియుడి గుండెల్లో పిడుగులు పడినంత పనైంది. ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఎంతమందిని మోసం చేస్తావని మొదటి ప్రియురాలు నిలదీయడంతో బంధువులు అంతా కలవరపాటుకు గురయ్యారు. పెళ్లిపై వినోద్‌ను నిలదీయంతో మాట పెగలేదు. దీంతో వినోద్ అసలు రంగు బయటపడిందని తెలుసుకున్న పెళ్లి కూతురు హర్షశ్రీ ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.