యూనివర్సిటీ డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్

  • Published By: madhu ,Published On : November 11, 2020 / 02:16 PM IST
యూనివర్సిటీ డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్

Updated On : November 11, 2020 / 2:47 PM IST

Nagarjuna University Degree Distance Education Exam : నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ యథేచ్ఛగా జరుగుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పరీక్షా కేంద్రంలో విద్యార్థులు చూసి రాతలు రాస్తున్నారు. ధర్మపురిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. చదివి కష్టపడకుండానే మాస్‌ కాపీయింగ్‌తో పట్టభద్రలవుతున్నారు. గైడ్స్‌, బుక్స్‌, మొబైల్‌ ఫోన్లు పెట్టుకుని చూసి రాస్తున్నారు.



ఎగ్జామ్‌ హాల్లో ఇన్విజిలేటర్‌ లేకుండానే పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు పరీక్ష రాస్తుంటే.. లోపలికి ఎవరూ రాకుండా నిర్వాహకులు కాపలా కాస్తున్నారు. మాస్‌ కాపీయింగ్‌ కోసం ఒక్కో విద్యార్థి నుంచి 4 వేల రూపాయలు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.



https://10tv.in/degree-student-aishwarya-suicide-note-makes-cry/
నాగార్జున యూనివర్సిటీ పర్యవేక్షణ కొరవడటంతోనే ఈ విధంగా జరుగుతోందన్ని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. నాగార్జునా యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ అధికారులతో పాటు ధర్మపురి పరీక్షా కేంద్రం నిర్వాహకులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.