Fire Broke Out : హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి

అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కెమికల్ గోదాం ఉంది. అపార్ట్ మెంట్ వాసులు, పలువురు కార్మికులు మంటల్లో చిక్కున్నారు.

nampally massive fire broke out

Nampally Fire Broke Out : హైదరాబాద్ లోని నాంపల్లిలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. బజార్ ఘాట్ లో హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందారు. అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కెమికల్ గోదాం ఉంది. అపార్ట్ మెంట్ వాసులు, పలువురు కార్మికులు మంటల్లో చిక్కున్నారు.

కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్స్ తో మంటలు ఆర్పివేస్తున్నారు.

Fire Broke Out : ఒడిశాలో రెండు చోట్ల భారీ అగ్ని ప్రమాదం

గ్రౌండ్ ఫ్లోర్ లో డీజిల్ డ్రమ్ముల్లో మంటల కారణంగా ప్రమాదం : డీసీపీ
మొదట కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిందని ఆ తర్వాత అపార్ట్ మెంట్ లోకి మంటలు వ్యాపించాయని డీసీపీ పేర్కొన్నారు. జీ+4 బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో డీజిల్ డ్రమ్ముల్లో మంటలు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు. మృతల్లో కొందరు మంటల్లో సజీవ దహనం కాగా, మరికొందరు ఊపిరాడక చనిపోయినట్లు నిర్ధారణ అయింది.

Fire At Dal Lake : శ్రీనగర్ దాల్‌ సరస్సులో భారీ అగ్నిప్రమాదం, పలు లగ్జరీ హౌస్‌బోట్లు దగ్ధం

15 మందిని రక్షించిన డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది..
డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, పోలీసులు 15 మందిని రక్షించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఎనిమిది మందికి వైద్యులు చికిత్స చేస్తున్నారు.

అగ్నిప్రమాద మృతుల వివరాలు
మృతులు మహ్మద్ ఆజమ్(54), మహ్మద్ హసీబుర్ రెహమాన్, రెహానా సుల్తానా (50), బీడీఎస్ డాక్టర్ తహూరా ఫర్హీన్(38), తహూరా ఫర్హీన్ ఇద్దరు పిల్లలు(5), తూభ(5), తరూబా(12), అవివాహిత ఫైజా సమీన్(25 రెండవ అంతస్తు ఉన్నారు.

Iran Fire Incident: ఇరాన్‌లోని డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 32 మంది మృతి

అయితే, బీడీఎస్ డాక్టర్ తహూరా ఫర్జీన్ ఈ బిల్డింగ్ లో నివాసం ఉండటం లేదు. సెలవులు ఉండటంతో పిల్లలతో పాటు బంధువుల ఇంటికి వచ్చింది. నాంపల్లి అగ్నిప్రమాదంపై కేసు నమోదు అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.