Bonalu (1)
Mathangi Swarnalatha : భక్తులు సంతోషంగా ఉండేవిధంగా చూసుకొనే బాధ్యత తనదేనని భవిష్యవాణి వినిపించే స్వర్ణలత తెలిపారు. సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా..2021, జూలై 26వ తేదీ సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు ఎన్నో కష్టాలు భరించి..తనకు పూజలు చేశారని, వీరందరినీ సంతోషంగా ఉండే విధంగా చూసుకొనే బాధ్యత తనదన్నారు.
Read More : Petrol Rates : స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు
ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారని, వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతారన్నారు. అయినా..ఎలాంటి భయపడొద్దని..తాను కాపాడుతానన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. అమ్మకు ఇంత చేసినం..మాకు ఏమి చేయలేదు అనొద్దన్నారు. ఎంతటి ఆపద వచ్చినా..తాను తొలగిస్తానని చివరిలో చెప్పారు. అంతకుముందు గత సంవత్సరం బోనాలు కార్యక్రమం నిర్వహించలేదని, ఈసారి మాత్రం బోనాలు, పూజలు సమర్పించారని..ఇందుకు సంతోషం ఉందా ? అని పండితులు ప్రశ్నించారు. ఎంత ఇబ్బంది పెట్టినా..తనను నమ్మిన వారు పూజలు జరిపించినందుకు సంతోషంగా ఉందన్నారు స్వర్ణలత.