Medchal district : భార్యను ముక్కలు చేసిన కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ 25 రోజుల్లో ఏం జరిగింది.. మృతురాలి తల్లి ఏం చెప్పారంటే..

మేడ్చల్ జిల్లా (Medchal district) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్యచేసి.. ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడో భర్త.

Medchal district

Medchal district : మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్యచేసి.. ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడో భర్త. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. భార్య శరీర భాగాలను ఏఏ ప్రాంతాల్లో పడేశాడనే విషయాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Sahasra Case : సహస్ర హత్యకి మొదట అడుగు పడింది ఆ రోజే.. బయటపెట్టిన పోలీసులు

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త కిరాతకంగా వ్యవహరించాడు. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (22) అదేగ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గతంలో ఇద్దరూ బోడుప్పల్ కు వచ్చి బాలాజీహిల్స్ లో జీవనం సాగించారు. అయితే, ఓ పది నెలలు ఉండి మళ్లీ వెళ్లిపోయారు. గత 25రోజుల క్రితం మళ్లీ ఇదే ప్రాంతానికి వచ్చి అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు.

స్వాతి ప్రస్తుతం గర్భవతి. మహేందర్ రెడ్డి రాపిడో నడుపుతున్నాడు. వీరిద్దరి మధ్య ఇటీవల ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి భార్య స్వాతిపై దాడి చేసి హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేశాడు. వాటిని ప్యాక్ చేసి పలు ప్రాంతాల్లో పడేశాడు. అయితే, దారుణ ఘటనను మహేందర్ రెడ్డి బంధువు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని.. విచారిస్తున్నారు.

మహేందర్ రెడ్డి స్వాతి మృతదేహాన్ని కాళ్లు, చేతులు, తల వేరుచేసి ప్రతాపసింగారం దగ్గర మూసీ ప్రాంతాల్లో పడిసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేవలం ఛాతి భాగంలో ఉన్న భాగం మాత్రమే పోలీసులకు లభ్యమైంది. అయితే, మహేందర్ రెడ్డి, స్వాతి దంపతులు 25రోజుల క్రితమే బోడుల్ప్ ప్రాంతంలోని బాలాజీహిల్స్ కు వచ్చి నివాసం ఉంటున్నారు. ఈ 25రోజుల్లో ఏం జరిగిందనే విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

స్వాతి తల్లి ఏమన్నారంటే..

మహేందర్ రెడ్డి నా కూతుర్ని మాయచేసి ఎత్తికెళ్లిపోయాడు. డిగ్రీ చదువుతున్న నా కూతురికి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడు. మహేందర్ మాయలో పడి నా కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రేమ వివాహం వద్దని చెప్పి మేము వారించాం. కానీ, మా మాట వినకుండా మహేందర్ ను పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులుగా నా కూతుర్ని చిత్రహింసలు పెడుతున్నారని చెప్పింది. స్వాతి అత్తామామలు, మహేందర్ కలిసి నా కూతుర్ని చంపేశారంటూ స్వాతి తల్లి కన్నీరు మున్నీరైంది.