తెలంగాణలో 24 గంటల్లో 753, కోలుకున్నది 952 మంది

  • Publish Date - November 28, 2020 / 10:46 AM IST

COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 753 కరోనా కేసులు నమోదయ్యాయి. 952 మంది కోలుకున్నారని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 68 వేల 418 ఉండగా..కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 56 వేల 330 గా ఉంది. 24 గంటల్లో ముగ్గురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1451కి చేరుకుంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేల 637 ఉండగా..గృహ/ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 8,459 ఉందని వెల్లడించింది.



ఇక జిల్లాల వారీగా కేసులు చూస్తే…
ఆదిలాబాద్ 11. భద్రాద్రి కొత్తగూడెం 36. జీహెచ్ఎంసీ 133. జగిత్యాల 22. జనగామ 01. జయశంకర్ భూపాలపల్లి 4. జోగులాంబ గద్వాల 04. కామారెడ్డి 9. కరీంనగర్ 47. ఖమ్మం 38. కొమరం భీం ఆసిఫాబాద్ 4. మహబూబ్ నగర్ 16.



https://10tv.in/after-cyclone-nivar-another-storm-brews-in-bay-of-bengal/
మహబూబాబాద్ 14. మంచిర్యాల 18. మెదక్ 09. మేడ్చల్ మల్కాజ్ గిరి 78. ములుగు 14. నాగర్ కర్నూలు 10. నల్గొండ 38. నారాయణపేట 00. నిర్మల్ 7. నిజామాబాద్ 14. పెద్దపల్లి 15. రాజన్న సిరిసిల్ల 19. రంగారెడ్డి 71. సంగారెడ్డి 18. సిద్దిపేట 10. సూర్యాపేట 22. వికారాబాద్ 10. వనపర్తి 3. వరంగల్ రూరల్ 12. వరంగల్ అర్బన్ 33. యాదాద్రి భువనగిరి 13. మొత్తం : 753.