Telangana Covid : 24 గంటల్లో 2 వేల 484 కేసులు, కోలుకున్న 4 వేల 207 మంది

మొత్తం 4 వేల 086 మంది చనిపోయారని పేర్కొంది. అలాగే…ఒక్కరోజులో 4 వేల 207మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,18,241గా ఉందని పేర్కొంది.

Telangana Corona New Cases : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా విస్తరిస్తూనే ఉంది. ప్రతి రోజు పాజిటివ్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమౌతోంది. వివిధ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ కూడా భయపెడుతోంది. అయితే.. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య 3 నుంచి 4 వేల వరకు నమోదవుతున్నాయి. తాజాగా..ఈ సంఖ్య తగ్గింది. బుధవారం 3 వేల 801, గురువారం 3 వేల 944 పాజిటివ్ కేసులు ఉంటే.. శుక్రవారం 3 వేల 877 కేసులు, శనివారం 3 వేల 590 మంది కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో 2 వేల 484 మందికి వైరస్ సోకిందని, ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. మొత్తం 4 వేల 086 మంది చనిపోయారని పేర్కొంది. అలాగే…ఒక్కరోజులో 4 వేల 207మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,18,241గా ఉందని పేర్కొంది.

Read More : Australian Open : రికార్డు సృష్టించిన నాదల్

జిల్లాల వారీగా కేసులు : – ఆదిలాబాద్ 26, భద్రాద్రి కొత్తగూడెం 43, జీహెచ్ఎంసీ 1045, జగిత్యాల 40, జనగాం 26, జయశంకర్ భూపాలపల్లి 10, జోగులాంబ గద్వాల 12, కామారెడ్డి 11, కరీంనగర్ 80, ఖమ్మం 107, కొమురం భీమ్ ఆసిఫాబాద్ 12, మహబూబ్ నగర్ 70, మహబూబాబాద్ 36, మంచిర్యాల 31, మెదక్ 17, మేడ్చల్ మల్కాజ్ గిరి 138, ములుగు 16, నాగర్ కర్నూలు 17, నల్గొండ 108, నారాయణపేట 18, నిర్మల్ 08, నిజామాబాద్ 45, పెద్దపల్లి 21, రాజన్న సిరిసిల్ల 22, రంగారెడ్డి 130, సంగారెడ్డి 58, సిద్ధిపేట 70, సూర్యాపేట 69, వికారాబాద్ 27, వనపర్తి 31, వరంగల్ రూరల్ 24, హన్మకొండ 88, యాదాద్రి భువనగిరి 28. మొత్తం : 2,484

ట్రెండింగ్ వార్తలు