Australian Open : రికార్డు సృష్టించిన నాదల్

ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ను నాదల్ ఎగురేసుకుని పోయాడు. ఈ టైటిల్ తో ప్రపంచంలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్ లను కైవసం చేసుకున్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.

Australian Open : రికార్డు సృష్టించిన నాదల్

Australian Open 2022

Rafael Nadal : ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ను నాదల్ ఎగురేసుకుని పోయాడు. ఈ టైటిల్ తో ప్రపంచంలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్ లను కైవసం చేసుకున్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. ఈ టైటిల్ తో గ్రాండ్ స్లామ్ ల సంఖ్య 21కి చేరుకోవడం విశేషం. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ మ్యాచ్ లో మెద్వెదెవ్ తో నాదల్ తలపడ్డాడు. నువ్వా నేనా అన్నట్లుగా ఈ పోటీ కొనసాగింది. ఆఖరి సెట్ వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ ను టెన్నిస్ క్రీడాభిమానులు ఊపిరిబిగపట్టుకుని చూశారు. చివరకు నాదెల్ విజయం సాధించాడు. 21వ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న నాదల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Read More : James: పునీత్ పాత్రకి అన్న శివరాజ్ డబ్బింగ్.. కన్నీటి పర్యంతం!

తొలి సెట్ లో మెద్వెదెవ్ దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి నాదల్ కు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో 6-2 తేడాతో ఫస్ట్ సెట్ ను మెద్వెదెవ్ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో సెట్ లో కూడా తన ప్రతాపం చూపించాడు. బలమైన షాట్లు కొడుతూ నాదల్ ను ఇరకాటంలోకి నెట్టాడు. నాదల్ కూడా తనదైన శైలిలో ఆడినా.. 6-7తో మెద్వెదెవ్ విజయం సాధించాడు. ఇక వరుసగా రెండు సెట్లు కోల్పోవడంతో మ్యాచ్ మెద్వెదెవ్ వశం అవుతుందని అందరూ భావించారు. నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా.. తన అనుభవాన్ని మొత్తం చూపించాడు.చివరి మూడు సెట్లలో విశ్వరూపం చూపించడంతో మెద్వెదెవ్ ఖంగుతినాల్సి వచ్చింది. 6-4, 6-4, 7-5తో విజయం సాధించాడు. అయితే..ఇద్దరూ చెరో రెండు సెట్లను కైవసం చేసుకోవడంతో ఐదో సెట్ వరకు మ్యాచ్ వెళ్లిపోయింది. నొప్పితో బాధ పడుతున్నా..టైటిల్ గెలవాలన్న కసితో నాదల్ ఆడాడు. చివరకు 2-6, 6-7, 6-4, 6-4, 7-5 తేడాతో రఫెల్ నాదల్ విజయం సాధించాడు.

Read More : Vijayawada Kid Mother: తల్లడిల్లుతున్న విజయవాడ చిన్నారి తల్లి

పాదానికి గాయం కారణంగా నాదల్ చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. గాయానికి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇంతలోనే కరోనా బారిన పడ్డాడు. 35ఏళ్ల నాదల్ అబుదాబిలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా మళ్లీ టెన్నిస్ కోర్టులో కనిపించాడు. కొత్త ఏడాదిలో జరిగిన ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కి నాదల్ సీరియస్ గా ప్రిపేర్ అయ్యాడు.