School students : ఓటింగ్ ప్రాధాన్యంపై మేరు ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల వినూత్న ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ ప్రాధాన్యంపై మేరు ఇంటర్నేషనల్ విద్యార్థులు వినూత్న ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఓటర్లను చైతన్యవంతులను చేస్తూ విద్యార్థులు ప్రచారం చేశారు. మియాపూర్, తెల్లాపూర్ ప్రాంతాల్లోని మేరు ఇంటర్నేషనల్ స్కూలు విద్యార్థులు ఓటింగ్ గురించి పెద్దలకు అవగాహన కల్పించారు.....

School students : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ ప్రాధాన్యంపై మేరు ఇంటర్నేషనల్ విద్యార్థులు వినూత్న ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఓటర్లను చైతన్యవంతులను చేస్తూ విద్యార్థులు ప్రచారం చేశారు. మియాపూర్, తెల్లాపూర్ ప్రాంతాల్లోని మేరు ఇంటర్నేషనల్ స్కూలు విద్యార్థులు ఓటింగ్ గురించి పెద్దలకు అవగాహన కల్పించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్న ఈ సమావేశంలో విద్యార్థులు ప్లకార్డులతో అభివాదం చేశారు. ”ఓటు వేయడం మీ హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా, బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది, ఓటు అనేది మన గళం.. మౌనంగా ఉండొద్దు” అనే నినాదాలతో ఫ్లకార్డులు ప్రదర్శించారు.

School students

ఓటర్ల అవగాహన ప్రచారంతోపాటు ర్యాలీలు జరిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ప్రాధాన్యాన్ని వివరించేలా నూక్కడ్ నాటకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులు ఓటు ప్రాముఖ్యతను ప్రచారం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. తమకు ఓటు లేదని, ఓటు ఉన్నవారందరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని చిన్నారులు కోరారు. మా భవిష్యత్తు మీరు వేసే ఓటులో ఉందని తెలిపారు. ఓటింగు ప్రచారంపై విద్యార్థులకున్న నిబద్ధత అందరి ప్రశంసలు అందుకుంది. ఓటర్ల ప్రచారోద్యమంలో మహిళా ఇన్ స్పెక్టరు సరితారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ALSO READ : పోలింగ్‌పై ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా నగర ఓటర్ల ఉదాశీనత.. అత్యల్ప ఓటింగ్

ట్రెండింగ్ వార్తలు