Telangana Rains: తెలంగాణలో మళ్లీ మారిన వాతావరణం.. రానున్న రెండు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు!

తెలంగాణలో(Telangana Rains) రెండు రోజుల పాటు వాతావరణం అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Meteorological Department announced possibility of rain in Telangana for next two days.

Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు పలు చోట్ల పిడుగులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వాహనదారులు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వర్షపు సూచన ఉన్న వేళ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

Vande Bharat Sleeper Train: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్.. పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్.. స్టేషన్స్ హాల్టింగ్ లిస్ట్ ఇదే!

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఈదురుగాలులతో భారీ వర్ష సూచన:

రానున్న 48 గంటల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉందని చెబుతూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశం మబ్బుపట్టి మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేశారు.

హైదరాబాద్‌లో వాతావరణం.. ప్రజలకు, అధికారులకు హెచ్చరికలు:

జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో వాతావరణం చల్లబడి సాయంత్రం లేదా రాత్రి వేళల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మెరుపులు వచ్చే సమయంలో విద్యుత్ స్తంభాలు, భారీ చెట్ల కింద నిలబడకూడదని వాతావరణ శాఖ ప్రజలకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది.