మహిళలను పంపాలంటూ..Micro Finance Apps ఆగడాలు, వీడియో

మహిళలను పంపాలంటూ..Micro Finance Apps ఆగడాలు, వీడియో

Updated On : December 20, 2020 / 8:00 PM IST

Microfinance representative harassment : తెలుగు రాష్ట్రాల్లో మైక్రోఫైనాన్స్ యాప్‌ (Microfinance app) ప్రతినిధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. డబ్బులు చెల్లించని వారిని బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారు ఫైనాన్స్ ప్రతినిధులు. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో.. మహిళలను పంపాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా లోన్ యాప్స్ (apps) వేధింపులు అధికమౌతున్నాయి. వీరి పెట్టే ఒత్తిడి భరించేలక..కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. లోన్‌ యాప్స్‌ నుంచి రుణాలు తీసుకుని బలవుతున్నారు. చాలామంది సామాన్యులు లోన్‌ తీసుకునేటప్పుడు ఎలాంటి నిబంధనలు ఒప్పుకుంటున్నారో కూడా తెలియనంతగా ట్రాప్‌లో చిక్కుకుంటున్నారు.

బ్యాంక్‌ అకౌంట్‌లో (Bank Account) పడిన జీతమంతా కాల్‌మనీ యాప్స్‌ (Call Money App) దోచుకొంటుంటే ఏం చేయాలో తెలియక కన్నీరు పెట్టుకుంటున్నారు. కొంతమంది కుటుంబాల్ని సాదలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆన్ లైన్ కాల్ మనీ కేసు (Online Call Money Case) లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మైక్రో ఫైనాన్స్ యాప్ లను రూపొందించిన యువకుడిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రుణాలు ఇస్తున్న ఆన్‌లైన్ యాప్‌ (Online App)లు డబ్బులు కట్టడం ఆలస్యమైతే మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల (Micro Finance Agents) వేధింపులు తాళలేక బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మైక్రో ఫైనాన్స్ యాప్ లో తీసుకున్న లోన్‌కు 50 % పైన వడ్డీ చెల్లించినట్లు భాదితులు ఫిర్యాదుచేస్తున్నారు. ఆన్ లైన్ మనీ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా భావిస్తున్నారు. మనీ యాప్ లను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మనీ యాప్ లు నిషేధించాలని కేంద్ర హోం శాఖ, ఐటీ శాఖ లకు తెలంగాణ పోలీస్ శాఖ లేఖ రాసింది.