Earthquake: తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం వచ్చింది. జిల్లా వ్యాప్తంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాలలో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
జిల్లాలో పలు చోట్ల భూప్రకంపనలతో జనాలంతా భయాందోళన చెందారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆందోళనకు గురయ్యారు. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సరిగ్గా 6.58 నిమిషాలకు పలు చోట్ల భూ ప్రకంపనలు
కనిపించాయి. దాదాపు 3 నుంచి 4 సెకన్ల పాటు భూమి కంపించింది. దాదాపు రెండుసార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు.
కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మానకొండూర్ నియోజకవర్గాల్లో భూప్రకంపనలు కనిపించాయి. పెద్దపల్లి జిల్లాలోనూ పలు చోట్ల చాలా స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.9గా నమోదైంది. గత నెల ఏప్రిల్ 10నే ఎపిక్ అనే ఒక సంస్థ.. భూకంపం వస్తుందని
హెచ్చరించింది. అన్నట్లుగా భూమి కంపించింది.
Also Read: ‘కుక్క కరిచి చనిపోయిన వ్యక్తి’ కేసులో పెద్ద ట్విస్ట్.. ఆ కుక్క అతడ్ని కాపాడడానికి ట్రై చేసిందట..
భూప్రకంపనలతో ఇంట్లో ఉన్న సామాను కింద పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలామంది భయంతో ఇళ్లలోకి వెళ్లకుండా ఆరు బయటే గడుపుతున్నారు. సింగరేణి ప్రాంతంలో భూప్రకంపనలు లేకపోయినా.. భూకంపం వస్తుందని హెచ్చరించిన నేపథ్యంలో కొంత ఆందోళన నెలకొంది.