Asaduddin Owaisi Letters Amit Shah, KCR
Asaduddin Owaisi Letters Amit Shah, KCR : సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్య దినోత్సవంగా నిర్వహించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. విమోచన దినం కన్నా సమైక్య దినోత్సవం అనడమే సరైనదని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన కోసం హిందూ, ముస్లింలు కలిసి పోరాటం చేశారని తెలిపారు. అమిత్ షా, కేసీఆర్‌కు లేఖలు రాశానని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు అని చెప్పారు. జాతీయ సమైక్య దినోత్సవం నిర్వహిస్తే..సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగా యాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు.