Living Together
Living Together: అబ్బాయికి 17 ఏళ్లు.. అమ్మాయికి 20.. ఇద్దరు ప్రేమించుకున్నారు. గత మూడు రోజుల క్రితం ఓ రూమ్ తీసుకోని ఇద్దరు కలిసి ఉంటున్నారు. మూడు రోజుల్లోనే ఇద్దరిమధ్య మనస్పర్థలు రావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా దురదృష్టవశాత్తు బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..యూసుఫ్‌గూడ సమీపలలోని యాదగిరి నగర్‌లో నివసించే బి.బాలాజీ(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో నివసించే బి. నీలిమ అలియాస్ అమ్ము(20)తో పరిచయం ఏర్పడింది. అమ్ము సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి వారం క్రితం జవహర్‌నగర్‌లో గది అద్దెకు తీసుకున్నారు.
గదిలోనే పెళ్లిచేసుకున్నారు. రూమ్ లో ఇద్దరికీ గొడవలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ మేరకు బాలాజీ ఫ్యాన్‌కు ఉరేసుకొగా అమ్ము చున్నీతో మెడకు బిగించుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. బాలాజీ మృతి చెందిగా ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.