Minister Gangula Counter : ఆ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ప్రధాని వ్యాఖ్యలకు గంగుల కౌంటర్

కేసీఆర్ కుటుంబం ఏమీ నామినేటెడ్ గా వచ్చి అధికారంలోకి రాలేదన్నారు. కేటీఆర్, కవిత, హరీశ్ రావు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులని గుర్తు చేశారు. దొడ్డి దారిన అధికారంలోకి రాలేదన్నారు.(Minister Gangula Counter)

Minister Gangula Counter : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ టార్గెట్ గా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఓ కుటుంబం పాలనలో బందీగా మారిందని, ఆ కుటుంబపాలనతో ప్రజలు విసిగిపోయారని, ఓ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తోందని ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు, విమర్శలకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.

PM Narendra Modi : కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ ఘాటు విమర్శలు..

ప్రధాని మోదీ.. తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం ఏమీ నామినేటెడ్ గా వచ్చి అధికారంలోకి రాలేదన్నారాయన. కేటీఆర్, కవిత, హరీశ్ రావు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులు అని గంగుల కమలాకర్ గుర్తు చేశారు. వారేమీ దొడ్డి దారిన వచ్చి అధికారంలోకి రాలేదన్నారు. కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.(Minister Gangula Counter)

” ప్రజలను ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ కు మాత్రమే ఉంది. దేశానికి విముక్తి కలగాలంటే మోdw ప్రభుత్వం దిగి పోవాలి. మీ పరిపాలన భేష్ గా ఉంటే గుజరాత్ మాకు ఎందుకు అభివృద్ధిలో పోటీగా రావడం లేదు. మతాన్ని, సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మీ పరిపాలనా ఎవరూ కోరుకోరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు. కేంద్రం.. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. విధ్వంసంతో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు” అని గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు.

హైదరాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. బేగంపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొన్న ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై పరోక్షంగా ధ్వజమెత్తారు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయింది అంటూ విమర్శలు చేశారు. ఒక కుటుంబం చేతిలో అధికారం ఉంటే ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారంటూ పరోక్షంగా కేసీఆర్ పాలనపై చురకలు వేశారు ప్రధాని మోడీ.

Bandi Sanjay: తెలంగాణలోమసీదులు తవ్వుదామా? శవాలు ఉంటే మీరు తీస్కోండీ..శివలింగాలుంటే మాకు ఇవ్వండి : ఓవైసీకి బండి సంజయ్ సవాల్

కుటుంబ పార్టీలు కేవలం తమ స్వలాభం కోసమే పనిచేస్తాయని.. తమ కుటుంబ అభివృద్ధి కోసమే పని చేస్తాయని అటువంటి వారికి ప్రజల బాధలు, కష్టాల గురించి తెలియవు అని అన్నారు. తమ కుటుంబ ఖజానాలు నిండటం గురించే ఆలోచిస్తారు తప్ప ప్రజల యోగక్షేమాల గురించి ఏమాత్రం ఆలోచించరని విమర్శించారు. దోచుకోవటం దాచుకోవటం ఒక్కటే వారికి తెలుసు అని అన్నారు. అటువంటివారు సమాజంలో చీలికలు తేవటానికి యత్నాలు చేసి వారి అధికారాలను కాపాడుకుంటుంటారని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు