Harish Rao : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ.. పేద ప్రజల ఇంటి కలను కేసీఆర్ నిజం చేశారు : మంత్రి హరీష్ రావు

బీజేపీ మాటలు నమ్మకండని ప్రజలకు సూచించారు. డబుల్ ఇంజన్ అంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్ రూము ఇండ్లు పేదలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుంటే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.

Harish Rao – Double Bedroom Houses : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేసి పేద ప్రజల ఇంటి కలను కేసీఆర్ నిజం చేశారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈరోజు కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ల దగ్గర అన్ని పండుగలు ఒకేసారి వచ్చిన వాతావరణం కన్పిస్తోంది. ఈరోజు కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ల దగ్గర అన్ని పండుగలు ఒకేసారి వచ్చిన వాతావరణం కన్పిస్తోందన్నారు. ధనికులు ఉండే ఈ ప్రాంతంలో పేదలకు కేసీఆర్ ఇండ్లు నిర్మించి ఇచ్చారని పేర్కొన్నారు. త్వరలో ఇక్కడకు మంచి ప్రభుత్వ ఆసుపత్రి, రేషన్ దుఖానాలు, బస్సు సౌకర్యం కూడా కల్పించబోతున్నామని చెప్పారు.

శనివారం సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ మున్సిపాలిటి పరిధిలోని కొల్లూరులో మంత్రి హరీష్ రావు డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వమత మందిరాలను నిర్మిస్తామని తెలిపారు. కొన్ని పార్టీలు ఆందోళనలకే పరిమితమైతే కేసీఆర్ పరిష్కార మార్గాలను వెతుకుతారని వెల్లడించారు. 12 వేల మంది ఉండే ఈ ప్రాంతంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పేదల బ్రతుకులు మారాయని వెల్లడించారు.

Ponguleti Srinivas Reddy : సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తా.. ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా : పొంగులేటి

బీజేపీ మాటలు నమ్మకండని ప్రజలకు సూచించారు. డబుల్ ఇంజన్ అంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్ రూము ఇండ్లు పేదలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుంటే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు 12 వేల మందికి మంత్రి హరీష్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ శరత్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంరద్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన వారికి అందరికీ పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. తర్వాత ఇంటి తాళాలు ఇస్తారని తెలిపారు. మరో ఆరు దశల్లో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇళ్లు వస్తాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు.

Congress – YSRTP : కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనంపై కసరత్తులు.. షర్మిల తెలంగాణలో పనిచేయడంపై రేవంత్ ససేమిరా, బుజ్జగిస్తున్న డీకే శివకుమార్

కానీ, ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఒక ఎకరం 8 నుంచి 10 కోట్ల రూపాయల విలువ చేస్తుందన్నారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖరీదైన భూముల్లో ఇళ్లు నిర్మిస్తున్నాయని వెల్లడించారు. కొద్దిమంది దుర్మార్గులు కావాలని గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంచి పనులు చేస్తుంటే కూడా స్పందించే పరిస్థితి వారికి లేదన్నారు. ఇప్పుడు ఇళ్లు రానివాళ్లకు గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం కూడా చేస్తామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు