Harish Rao On Houses : గుడ్‌న్యూస్… ఏప్రిల్ నుంచి ఇళ్ల నిర్మాణం -హరీశ్ రావు

ఏప్రిల్ మొదటి వారం నుంచి సొంత స్థలం ఉన్నవారికి రూ.3లక్షలతో ఇళ్ల నిర్మాణాల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని..(Harish Rao On Houses)

Harish Rao On Houses : ఇళ్ల నిర్మాణం గురించి మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి సొంత స్థలం ఉన్నవారికి రూ.3లక్షలతో ఇళ్ల నిర్మాణాల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మెదక్ పట్టణంలోని జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన రజకుల ఆత్మగౌరవ సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. అలాగే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయంపై సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.(Harish Rao On Houses)

రజకుల కోసం 33 జిల్లాల్లో రెండేసి కోట్లతో మోడ్రన్ దోబీ ఘాట్లను నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 80శాతం సబ్సిడీతో రజకులకు రుణాలు ఇవ్వనున్నట్లు వివరించారు. నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు దేశంలో ఎక్కడా లేవన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం కొనసాగుతూనే ఉందని మంత్రి వెల్లడించారు.(Harish Rao On Houses)

Harish Rao Medak : గిరిజనుల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు-హరీశ్ రావు

మెదక్ లో రజకుల కమ్యూనిటీ హాల్ కోసం రెండు ఎకరాలు కేటాయించామని.. కోటి రూపాయలతో జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నామని చెప్పారు. మెదక్ కు మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 60ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో మూడే మెడికల్ కాలేజీ లు వచ్చాయని.. కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆరేళ్లలో రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.(Harish Rao On Houses)

”వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించారు. దక్షిణ భారత దేశంలోనే స్వచ్ఛ భారత్ సృష్టి కర్త సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని మెదక్‌లో ఏర్పాటు చేశాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం కొనసాగుతూనే ఉంటుంది. మెదక్ పట్టణంలో 500 బెడ్ల హాస్పిటల్‌ను నెలకొల్పుతాం. మెదక్ కు మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో మూడే మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆరేళ్లలో తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం” అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

మెదక్ పట్టణంలో పిల్లికోటల దగ్గర రూ.4 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. గిరిజనులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగిందన్నారు.

Minister Harish Rao : తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసింది ? మంత్రి హరీష్ రావు

తండాల అభివృద్ధి కోసం, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. రూ.25 లక్షలతో గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాల కోసం రూ.600 కోట్లు కేటాయించామన్నారు. మెదక్ లో మూడు గిరిజన రెసిడెన్షియల్ విద్యాసంస్థల కోసం నిధులు కేటాయించినట్టు మంత్రి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు