Minister Harish Rao : తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసింది ? మంత్రి హరీష్ రావు

తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనులకు అడ్డుపడుతూ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.

Minister Harish Rao : తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసింది ? మంత్రి హరీష్ రావు

Harish Rao

Harish Rao angry BJP : వరంగల్ నూతన జిల్లా ఆస్పత్రికి రాబోయే రోజుల్లో వైద్యులతో పాటు అన్ని రకాల ఎక్యుప్ మెంట్లు రాబోతున్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. నర్సంపేట.. జిల్లా కాకపోయినా నర్సంపేట ప్రజలకు జిల్లా ఆస్పత్రితో టీ డయాగ్నోస్టిక్ హబ్ వచ్చిందన్నారు. వరంగల్ జిల్లాలో ఆయన శనివారం (మార్చి 5,2022) నర్సంపేట పరిసర ప్రాంత ప్రజలు ఈ టీ డయాగ్నోస్టిక్ లో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు. నర్సంపేట పరిసర ప్రాంతంలో మరో 13 సబ్ సెంటర్లకు రూ. 20 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నెక్కొండ, దుగ్గొండి మండలాల్లో వైద్య పరిస్థితి మరింత మెరుగు పడేలా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

రూ. 25 వేల కోట్లు ఇస్తాం.. బాయిలు, బోర్ల వద్ద కరెంటు మీటర్లు పెడుతామని కేంద్రంలోని బీజేపీ పాలకులు అంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలకులు ఇస్తామన్న రూ. 25 వేల కోట్లు వద్దు… తెలంగాణ రైతుల పొలాల్లో ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టబోమని వాదించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ ద్వారా 365 రోజులు వరంగల్ జిల్లాకు నీళ్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని కొనియాడారు. నర్సంపేట పట్టణంలోని మినీ ట్యాంకు బండ్ మాధన్నపేట చెరువు అభివృద్ధి పనులకు రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Telangana : మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్

తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనులకు అడ్డుపడుతూ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ఆపడం తప్పా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎలక్షన్స్ తరువాత పెట్రోలు, డీజీల్ మరియు ఎరువుల ధరలు పెంచే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.500 నుంచి రూ.600 కోట్లు వడ్డీలేని రుణాలను త్వరలోనే మంజూరు చేయనున్నామని తెలిపారు. ఆశా, ఏఎన్ఎం వర్కర్లు గర్బిణీ మహిళలకు సాధారణ ప్రసవం జరిగే విధంగా గర్భిణీ, వారి కుటుంబ సభ్యులను చైతన్య పర్చాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20 నుంచి 30 శాతం మాత్రమే సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని.. దీనిని వంద శాతంకు పెరిగేలా వైద్యులతో పాటు సిబ్బంది కృషి చేయాలన్నారు.