Telangana : మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్

తెలంగాణపై ప్రధాన మంత్రి మోదీ అక్కసు వెళ్లగక్కుతున్నారని, వలస కార్మికుల వల్లే కరోనా వచ్చిందని ఆయన మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కుంభమేళా పెడితే కరోనా పెరగలేదా..? 

Telangana : మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్

Harishrao

Harish Rao Condemns PM Modi’s Comments : రెండు తెలుగు రాష్ట్రాల విభజన అందరి అభిప్రాయాల మేరకు జరగలేదంటూ పార్లమెంట్ లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో నిరసన ప్రదర్శనలు నిర్వహించిన ఆ పార్టీ నేతలు..తాజగా..ఎంపీలు మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ అంశంపై మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. 2022, ఫిబ్రవరి 10వ తేదీ గురువారం హన్మకొండకు వచ్చారు. అక్కడ మెటర్నటీ ఆసుపత్రి ఆవరణలో టి.డయాగ్నస్టిక్ హబ్ కు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Read More : Tollywood Mega Meeting: సీఎం జగన్ దగ్గరికి.. భారీ సినిమాల తరఫున ప్రతినిధులంతా వెళ్లినట్టే..!

తెలంగాణపై ప్రధాన మంత్రి మోదీ అక్కసు వెళ్లగక్కుతున్నారని, వలస కార్మికుల వల్లే కరోనా వచ్చిందని ఆయన మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కుంభమేళా పెడితే కరోనా పెరగలేదా..? ట్రంప్ సభలు, ఎలక్షన్ ర్యాలీలతో వైరస్ వ్యాప్తి చెందలేదా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలంగాణ అమరులను మోదీ కించపర్చారని, తెలంగాణ త్యాగాలను, ఆకాంక్షలను చిన్నగా చేసి చూస్తున్నారని తెలిపారు. ఆ రోజు తల్లిని చంపి బిడ్డను బతికించారని కామెంట్స్ చేసిన విషయాన్ని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. మోదీ, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్ర బీజేపీ నాయకులు మోదీ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారన్నారు.

Read More : UP Elections : యూపీలో తొలి విడత 11 జిల్లాల్లో ప్రారంభమైన పోలింగ్..

వ్యవసాయ చట్టాల విషయంలో మూజువాణి ఓటుతో ఎలా బిల్ పాస్ చేశారు ? అని నిలదీశారు. తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లినట్లు, దేశంలో ఏడు బెస్ట్ గ్రామాలలో ఏడు తెలంగాణకే వచ్చాయంటే అది తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పారు మంత్రి హరీష్ రావు. రెండు తెలుగు రాష్ట్రాల విభజన అందరి అభిప్రాయాల మేరకు జరగలేదంటూ పార్లమెంట్ లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారంటూ ఆరోపించారు మోదీ. ఏపీ, తెలంగాణ వైషమ్యాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదన్న మోదీ.. విభజన కోసం అనుసరించిన పద్ధతి సరిగా లేదన్నారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదని మోదీ మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు ప్రధాని మోదీ.