Minister Harish Rao : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డకౌట్, బీజేపీ రనౌట్, కేసీఆర్ సెంచరీ : హరీష్ రావ్

కేసీఆర్ కి సుమన్ అంటే బాగా ఇష్టం, సుమన్ ఏది అంటే అది సీఎం ఇస్తారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఎవ్వరు చెయ్యని పనిని బాల్క సుమన్ చేశాడు అంటూ ప్రశంసించారు.

Harish Rao

Harish Rao :  తెలంగాణలో రానున్న ఎన్నికలను మంత్రి హరీశ్ రావు క్రికెట్ తో పోల్చారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగిన కాంగ్రెస్ పార్టీ డకౌట్, బీజేపీ రనౌట్, సిఎం కేసీఆర్ సెంచరీ కొడుతారు అంటూ హరీశ్ రావు తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో రూ.10 కోట్లతో 50 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా హరీశ్ రావు కాంగ్రెస్, బీజేపీలపై సెటర్లు వేశారు. విమర్శలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కవని బీఆరెఎస్ గెలుపు మరోసారి ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.నడ్డా తెలంగాణలో పర్యటనపై హరీశ్ రావు విమర్శలు చేస్తు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి సొంత రాష్టంలో దిక్కు లేదు, తెలంగాణలో ఏమి చేస్తావ్ అంటూ ప్రశ్నించారు.

చెన్నూరులో రూ.14 కోట్ల 80 లక్షలతో సుద్దాల బిడ్జ్ ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు రూ.55 కోట్లలతో చెన్నూర్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.చెన్నూరులో బాల్క సుమన్ సీటు గురించి స్పష్టంచేస్తు చెన్నూరులో బాల్కసుమర్ గెలుపు ఖాయం అని అన్నారు. చెన్నూర్ లో రెవెన్యూ డివిజన్ దశాబ్దాల కల బాల్క సుమన్ తో సాధ్యమైందని..కేసీఆర్ కి సుమన్ అంటే బాగా ఇష్టం, సుమన్ ఏది అంటే అది సీఎం ఇస్తారు అని తెలిపారు.చెన్నూర్ నియోజకవర్గంలో ఎవ్వరు చెయ్యని పనిని బాల్క సుమన్ చేశాడు అంటూ ప్రశంసించారు. సుమన్ చెన్నూర్ లో ఉన్న హైదరాబాద్ లో ఉన్న చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి గురుంచి ఆలోచిస్తాడు అంటూ ప్రశంసలు కురిపించారు.

Most Expensive Lehenga : వజ్రాల లెహంగా, ధర వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే

కర్నాటక నుండి రాష్ట్రానికి డబ్బులు వస్తాయట అంటూ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుంది అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఎద్దేవా చేశారు హరీశ్ రావు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు వస్తాయని ఆశపడుతున్నారు అంటూ సెటైర్లు వేశారు.రేవంత్ రెడ్డి పార్టీ రాష్టంలో మారని పార్టీ లేదు..అటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్ముతారా..? అంటూ ప్రశ్నించారు. ఛత్తీస్ ఘడ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 600 రూపాయలు పెన్షన్స్ ఇస్తున్నారు..అదే తెలంగాణ రైతులకు అండగా నిలిచింది కేసిఆర్, అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేశారు అంటూ వివరించారు.

చెన్నూర్ అభివృద్ధి జరగటం కొనసాగాలంటే మరోసారి బాల్క సుమన్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముటాలు, మంటలు అనే నినాదం ఉంది..అటువంటి కాంగ్రెస్ లో సీఎం కుర్చీ కోసం కొట్లాడుతారు తప్ప అభివృద్ది గురించి ఆలోచించరు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత కల్లోలలు, గొడవలు, కరువులేనని అటువంటి పరిస్థితి మనకు వద్దన్నారు. ప్రాణహిత, గోదావరి నదుల తీరప్రాంతంలో ప్రక్కన కరకట్టలు కడుతామని మునిగిపోయిన రైతుల పంట పొలాలను రీసర్వే చేయుంచి వారికి నష్టపరిహారం ఇస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు.